అమెరికా ప్రభుత్వ శాఖలు, సంస్థలపై జరిగిన సైబర్ దాడి వెనుక రష్యా హస్తం ఉందని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. ఇది రష్యన్ హ్యాకర్ల పనేనని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని, ఇందులోని కొన్ని వివరాలు గోప్యంగా ఉంచాల్సి వస్తుందని భావిస్తున్నానని అన్నారు. శుక్రవారం ఓ రేడియో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు.
"మన జీవనశైలి, వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలి అనుకున్న దేశాల్లో రష్యా కూడా ఉంది. సైబర్‌స్పేస్‌కు రష్యా ఇచ్చే ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ఈ అసమాన వైఖరి చాలా కాలం నుంచి ఉంది."
-- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.
వివరాలు తెలియాలి..
ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. దర్యాప్తు జరుపుతున్న కొద్దీ మరిన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ దాడిపై లోతైన దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వంలో సరైన సిబ్బంది సరిపడా లేరని నిపుణులు విమర్శిస్తున్నారు.
ఇదీ చూడండి : అమెరికా ప్రభుత్వ శాఖలపై సైబర్ దాడి