అమెరికాలోని మిన్నెసోటాలో కాల్పుల మోత మోగింది. బఫెల్లో నగంరంలోని అలినా క్లీనిక్ సమీపంలో.. ఓ దుండగుడు ప్రజలపై కాల్పులకు తెగబడినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలువురు గాయపడినట్టు పేర్కొన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేసినట్టు స్పష్టం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అయితే తమ వద్ద ఉన్న వ్యక్తికి.. కాల్పులతో సంబంధం ఉందా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.
అయితే ఈ క్లీనిక్‌లో కరోనా టీకాలు పంపిణీ చేస్తున్నారా? అనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లేదు.
ఇదీ చూడండి:- క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేస్తే 10ఏళ్ల జైలు శిక్ష