ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా.. శునకాల్ని చూసుకునే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి ఆమె రెండు ఫ్రెంచ్ జాతి శునకాల్ని ఎత్తుకెళ్లారు. అమెరికాలోని లాస్ఏంజలస్లో ఉత్తర సియోర్రా బోనిటా అపార్ట్మెంట్ వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
లేడీ గాగా శునకాల్ని చూసుకునే వ్యక్తి రోజూ లాగే మూడు శునకాలతో బయటికి వచ్చాడు. అందులో ఒక శునకం పారిపోయింది. ఆ శునకం కోసం అతను వెతుకుతుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఆ శునకాల్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించగా అతను అడ్డుకున్నాడని జోనాథన్ ట్రిప్పెట్ అనే పోలీసు తెలిపారు. అయితే ఆ దుండగుల్ని సంరక్షకుడు అడ్డుకోబోగా అతనిపై వారు తుపాకీతో కాల్పులు జరిపారని వెల్లడించారు. లేడీ గాగా సినిమా షూటింగ్ కోసం రోమ్ వెళ్లినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: తల్లి చాకచక్యంతో మంటల్లోనుంచి బయటపడ్డ చిన్నారులు