ETV Bharat / international

నిందితుడిపై పోలీసుల కాల్పులు- మధ్యలో టీనేజర్ బలి - డ్రెస్సింగ్ రూంలో బాలిక మృతి

Police kill teen girl: ఓ స్టోర్​లో నిందితుడిపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అకారణంగా ఓ టీనేజర్ బలైపోయింది. డ్రెస్సింగ్​ రూంలో ఉన్న ఆమెకు తూటా తాకగా ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలో ఈ ఘటన జరిగింది.

Police kill teen girl, los angeles firing
అమెరికా లాస్​ఏంజెలెస్​లో కాల్పులు
author img

By

Published : Dec 24, 2021, 8:49 AM IST

Updated : Dec 24, 2021, 12:13 PM IST

Police kill teen girl: అమెరికాలో ఓ దుండగుడి దుశ్చర్య కారణంగా 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపగా.. తూటా తగిలి డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆమె మరణించింది.

అసలేమైందంటే..?

Los angeles firing: లాస్ ఏంజెలెస్​లోని బర్లింగ్​టన్​ స్టోర్​లో మారణాయుధంతో ఓ దుండగుడు.. మహిళపై దాడికి పాల్పడుతున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. అదే స్టోర్​లో మరో వ్యక్తిపై నిందితుడు దాడికి పాల్పడుతుండగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.

అయితే.. కాల్పుల సమయంలో ఓ బుల్లెట్​.. డ్రెస్సింగ్​ రూమ్​ గోడలో నుంచి దూసుకెళ్లి.. అందులో ఉన్న టీనేజర్​కు తగిలింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని లాస్​ఏంజెలెస్ పోలీస్ డిపార్ట్​మెంట్ అసిస్టెంట్ చీఫ్​ డోమినిక్ చోయ్​ తెలిపారు. అది మూమాలు గోడే అని భావించి తాము కాల్పులు జరిపామని చెప్పారు. ఘటన అనంతరం.. లోపల టీనేజర్ మరణించి కనిపించిందని పేర్కొన్నారు.

Polce firing in store: నిందితుడు, మృతురాలి పేర్లను అధికారులు వెల్లడించలేదు. సదరు టీనేజర్.. స్టోర్​లో కాల్పుల సమయంలో భయంతో పరిగెత్తి డ్రెస్సింగ్ రూమ్​లో దాక్కుందా? లేదా కాల్పులకు ముందే అందులో ఉందా? అనే విషయం తెలియదని చెప్పారు. నిందితుడి దాడిలో ముందుగా గాయపడ్డ మహిళ పరిస్థితి విషమంగా ఉందని.. ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందుతోందని అధికారులు తెలిపారు. మహిళపై దాడి చేయడానికి గల కారణాలు తెలియవని పేర్కొన్నారు.

నిందితుడి వద్ద నుంచి ఓ భారీ మెటల్ కేబుల్ లాక్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిగిన దాదాపు రెండు గంటల తర్వాత ప్రజలను స్టోర్​ నుంచి బయటకు పంపించారు.

ఇదీ చూడండి: పాపం.. ఆ మహిళ ఫోన్​కు వరుసగా 4,500 కాల్స్​.. చివరకు...

ఇదీ చూడండి: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి!

Last Updated : Dec 24, 2021, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.