ETV Bharat / international

క్యాసినోలో కాల్పులు-సాయుధుడు హతం - అమెరికా విస్కాన్సిన్ కాల్పులు వార్తలు

అమెరికాలోని ఓ క్యాసినోలో కాల్పులు చేసిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ఈ దాడి యాదృచ్ఛికంగా జరిగింది కాదని, నిర్దిష్టమైన లక్ష్యంతోనే దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Police fatally shoot gunman who killed 2 at Wisconsin casino
క్యాసినోలో కాల్పులు చేసిన సాయుధుడు హతం
author img

By

Published : May 3, 2021, 5:38 AM IST

Updated : May 3, 2021, 8:50 AM IST

అమెరికా విస్కాన్సిన్​లోని ఓ క్యాసినోలో కాల్పులకు తెగబడిన సాయుధుడిని పోలీసులు మట్టుబెట్టారు. గ్రీన్​బేలోని ఓనైడా క్యాసినోలో జరిగిన ఈ కాల్పులు యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా మరొకరికి గాయాలయ్యాయి. ఘటన సమయంలో బుల్లెట్ల వర్షం కురిసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

"నిర్దిష్టమైన లక్ష్యంతోనే దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. అతను కాల్చాలనుకున్న వ్యక్తి అక్కడ లేదు. కానీ ఆ వ్యక్తి స్నేహితులు, సహోద్యోగులను కాల్చేందుకు యత్నించినట్లు తెలుస్తోంది."

-కెవిన్ పావ్లాక్, బ్రౌన్ కౌంటీ అధికారి

అయితే, దుండగుడితో పాటు మృతుల వివరాలను పోలీసులు వెల్లడించలేదు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: అఫ్గాన్​లో అగ్నిప్రమాదం- ఏడుగురు మృతి

Last Updated : May 3, 2021, 8:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.