ETV Bharat / international

అమెరికాలో కాల్పుల మోత.. నలుగురు మృతి - అమెరికా లేటెట్స్​ న్యూస్

అమెరికాలో ఆదివారం తెల్లవారుజామున కాల్పుల మోత మోగింది. సిన్​సిన్నటి నగరంలో మూడు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల ఘటనల్లో నలుగురు మృతి చెందారు. 18మంది తీవ్రంగా గాయపడ్డారు.

Police: At least 18 shot, with 4 dead, across Cincinnati
అమెరికాలో కాల్పుల మోత
author img

By

Published : Aug 17, 2020, 1:10 AM IST

Updated : Aug 17, 2020, 1:20 AM IST

అమెరికా సిన్​సిన్నటి నగరంలో ఆదివారం తుపాకుల మోత మోగింది. గంటన్నర వ్యవధిలోనే మూడు చోట్ల కాల్పుల ఘటనలు జరిగాయి. మొత్తం నలుగురు మృతి చెందగా, 18మందికి తూటాల గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

ఆదివారం ఉదయం 12:30 గంటలకు అవోండేల్ ప్రాంతంలో కాల్పుల జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. 21 ఏళ్ల యువకుడు ఆంటోనియో బ్లెయిర్​కీ తీవ్ర గాయాలయ్యాయి. అతడిని యూనివర్సిటీ హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురికీ బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని కూడా అదే ఆస్పత్రికి తరలించారు.

అనంతరం 2:15 గంటలకు ఓవర్​ ద రైనీ ప్రాతంలో మరో కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులకు ఫోన్​ వచ్చింది. ఈ ఘటనలో 10మంది గాయపడ్డారు. ఒక్కరు ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

అంతకు ముందు శనివారం అర్ధరాత్రి వాల్​నట్​ ప్రాంతంలోని ఓ ఇంట్లో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలు గంటన్నర వ్యవధిలో జరిగినట్లు పేర్కొన్నారు. ఇలా జరగడం భయానకమని పోలీసు అధికారి చెప్పారు.

అయితే ఆదివారం ఉదయం మరో చోట జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

ఈ నాలుగు ఘటనలకు సంబంధించి అనుమానితులుగా ఇప్పటివరకు ఎవరినీ గుర్తించలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: హోటల్​పై ఉగ్రవాదుల దాడి..10 మంది మృతి

Last Updated : Aug 17, 2020, 1:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.