హాలోవీన్ రోజున కెనడాలోని క్యూబెక్ సిటీలో ఓ దుండగుడు కత్తితో దాడులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు క్యూబెక్ సిటీ పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడింది తానే అని అంగీకరించినట్లు పేర్కొన్నారు. అతడు ఏ ఉద్దేశంతో ఈ కిరాతకానికి ఒడిగట్టాడనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదన్నారు.
కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన ఐదుగురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం లేదు.