ETV Bharat / international

కాల్పుల్లో 8 మంది మృతి- మెక్సికోలో భారత మహిళ.. - వాషింగ్టన్​ కాల్పుల్లో ముగ్గురు మృతి

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. వాషింగ్టన్​లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు అమెరికా సరిహద్దు దేశం మెక్సికోలోని ఓ రెస్టారెంట్​లో విదేశీయులపై కాల్పులు జరిపారు దుండగులు. చనిపోయిన వారిలో ఓ భారతీయ మహిళ కూడా ఉందని పోలీసులు తెలిపారు.

Washington state shooting
వాషింగ్టన్​లో కాల్పులు
author img

By

Published : Oct 22, 2021, 10:53 AM IST

అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. తాజాగా వాషింగ్టన్​లోని టకోమాలో జరిగిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మెక్సికోలోని ఓ రెస్టారెంట్​లో జరిగిన కాల్పుల్లో ఓ భారతీయ మహిళ ప్రాణాలు వదిలింది.

టకోమా కాల్పుల్లో..

అమెరికాలోని వాషింగ్టన్​ టకోమాలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతణ్ని స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ఆ వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం 5.30కు జరిగినట్లు పేర్కొన్నారు. నగరంలోని ఈస్ట్‌సైడ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎవెరెట్ స్ట్రీట్‌లోని 4200 బ్లాక్‌లో కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. స్థానికులు ఆ పరిసర ప్రాంతానికి దూరంగా ఉండాలని కోరారు.

నెబ్రాస్కాలో మరో ఇద్దరు..

అమెరికాలోనే నెబ్రాస్కాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ఘటన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.

మెక్సికోలో మరో ఇద్దరు..

మెక్సికన్ కరేబియన్ రిసార్ట్ టులమ్‌లోని రెస్టారెంట్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు పేర్కొన్నారు. చనిపోయిన వారిలో ఓ భారతీయ మహిళ ఉన్నట్లు చెప్పారు. మరొకరు జర్మనీకి చెందిన మహిళగా.. పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో కూడా ఇద్దరు జర్మనీ దేశస్థులు కాగా.. ఒకరు నెదర్లాండ్స్​కు చెందిన వారిగా వివరించారు.

ఇదీ చూడండి: చైనా 'బొమ్మ'ల్లో ప్రమాదకర రసాయనాలు- భారత్​ జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.