మెక్సికోలో కొంతమంది దుండగులు మారణహోమం సృష్టించారు. గువానాహువాటో రాష్ట్రం ఇరాపూవాటోలోని ఓ డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రంలో జరిగిన కాల్పుల్లో 24 మంది మరణించారు. ఏడుగురు గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
రిహాబిలిటేషన్ కేంద్రంలోని అందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కేంద్రంలోని దృశ్యాలు రక్తసిక్తమైన యుద్ధభూమిని తలపిస్తోందని ఓ అధికారి అన్నారు.
ఈ ఘటన వెనుక కారణాలు తెలియరాలేదని, స్థానిక డ్రగ్ సరఫరాదారుల ముఠాకు సంబంధం ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.