ETV Bharat / international

ఆర్థిక లక్ష్యాల కంటే మానవాళి శ్రేయస్సే ముఖ్యం: మోదీ

కరోనా ధాటికి పతనమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కాపాడడానికి, ఆరోగ్య సంక్షోభాన్ని నివారించేందుకు ఓ కొత్త విపత్తు నిర్వహణ ప్రోటోకాల్ రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. జీ-20 దేశాధినేతలతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడిన మోదీ... ఆర్థిక లక్ష్యాల కంటే మానవాళి శ్రేయస్సే ప్రధానంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

PM pitches for new crisis management protocol at G-20 video conference on coronavirus
ఆర్థిక లక్ష్యాల కంటే మనుష్యుల శ్రేయస్సే ముఖ్యం: మోదీ
author img

By

Published : Mar 27, 2020, 5:26 AM IST

ఆర్థిక లక్ష్యాల కంటే మానవాళి శ్రేయస్సే ముఖ్యం: మోదీ

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచ దేశాలు ఆర్థిక లక్ష్యాల కంటే మానవ శ్రేయస్సుపై ప్రధానంగా దృష్టి సారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జీ-20 దేశాధినేతల వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడిన మోదీ.. ఈ విపత్కర సమయంలో ప్రపంచ దేశాలు పరస్పర సహకారం అందిపుచ్చుకోవాలని సూచించారు.

"కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు పతనం అవుతున్నాయి. ఆరోగ్య సంక్షోభం ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు సమర్థవంతమైన 'విపత్తు నిర్వహణ (ప్రోటోకాల్​) విధివిధానాలు', 'బలమైన కార్యాచరణ ప్రణాళిక' రూపొందించాల్సిన అవసరం ఉంది."

- నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి

సంక్షోభాన్ని నివారించేందుకు..

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు శాస్త్ర పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. ఇందుకు కావలసిన విధివిధానాలను అభివృద్ధి చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

కరోనా నివారణ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) వంటి సంస్థల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు.

మొత్తం మానవజాతి సమష్టి శ్రేయస్సు దృష్ట్యా వైద్య పరిశోధన ఫలితాలు ప్రపంచ దేశాలన్నింటికీ ఉచితంగా లేదా సరసమైన ధరల్లో అందుబాటులోకి రావాలని మోదీ ఆకాంక్షించారు.

పేద దేశాలను ఆదుకోవాలి..

కరోనా ప్రభావంతో ఆర్థికంగా అతలాకుతలమైన పేద దేశాలకు జీ20 దేశాలు చేయూతనివ్వాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 5 లక్షలు దాటిన కరోనా కేసులు.. అమెరికాలోనే తీవ్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.