ETV Bharat / international

అరెస్టుకు ముందే దేశ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్య

పెరూ మాజీ అధ్యక్షుడు అలాన్​ గార్సియా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు జరిగిన సంఘటనల వీడియోను అధికారులు విడుదల చేశారు. ఈ నెల 17న అవినీతి కేసులో అరెస్ట్​ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లిన క్రమంలో ఆత్మహత్య చేసుకున్నారు గార్సియా.

అరెస్టుకు ముందే దేశ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్య
author img

By

Published : Apr 23, 2019, 10:50 AM IST

అరెస్టుకు ముందే దేశ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్య

అవినీతి కేసులో అరెస్ట్​ చేస్తారనే భయంతో పెరూ మాజీ అధ్యక్షుడు అలాన్​ గార్సియా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 17న జరిగిన ఘటనకు ముందు జరిగిన దృశ్యాలను హోంశాఖ విడుదల చేసింది.

లాటిన్​ అమెరికాలో జరిగిన అతిపెద్ద అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గార్సియాను అరెస్ట్​ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. వారితో మాట్లాడిన ఆయన ఇప్పుడే వస్తానని భవనంపై అంతస్తులోకి వెళ్లారు. గార్సియా నడుముకు తుపాకీ​ ఉన్నట్లు గ్రహించిన పోలీసులు ఆయనను అనుసరిస్తూ పైకి వెళ్లారు. మాజీ అధ్యక్షుడు పడక గదిలోకి వెళ్లగా బయటే వేచి ఉన్నారు పోలీసులు. కాసేపటికే గార్సియా తుపాకీతో తలపై కాల్చుకుని మరణించారు.

"ఓడెబ్రేచ్​ కేసులో భాగంగా గార్సియాను అదుపులోకి తీసుకనేందుకు అరెస్ట్​ వారెంట్​తో ఆయన ఇంటికి గత బుధవారం పోలీసులు వెళ్లారు. న్యాయవాదికి ఫోన్​ చేసుకుంటానని కోరారు. ఆ తరువాత తన పడక గదిలోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని చనిపోయారు."
- పోలీసు అధికారులు.

పెరూను రెండు పర్యాయాలు పాలించారు అలాన్​ గార్సియా. మొదటి పాలన కాలం 1980లో దేశంలో ఆర్థిక సంక్షోభం, తిరుగుబాటుదారుల ఆందోళనతో అధికారం కోల్పోయారు. మళ్లీ 2006లో అధికారం చేపట్టారు.

దశాబ్దకాలం క్రితం నగర మెట్రో నిర్మాణంలో భాగంగా బ్రెజిల్​ నిర్మాణ సంస్థ ఓడెబ్రేచ్​ నుంచి ముడుపులు తీసుకున్నట్లు గార్సియాపై ఆరోపణలున్నాయి.

ఇదీ చూడండీ: హ్మదాబాద్​లో ఓటేసిన నరేంద్ర మోదీ

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.