ETV Bharat / international

ఇంటి విషయంలోనూ ట్రంప్​కు తప్పని చిక్కులు!

author img

By

Published : Jan 29, 2021, 11:00 AM IST

Updated : Jan 29, 2021, 11:45 AM IST

సౌత్​ ఫ్లోరిడాలోని 'మర్​-ఏ-లాగో' ఇంటికి సంబంధించి ఒప్పందాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. ఉల్లంఘించినట్లు తెలుస్తోంది​. బైడెన్​ రాకతో శ్వేతసౌధాన్ని వీడిన ట్రంప్​.. అప్పటి నుంచి ఈ భవంతిలోనే నివసిస్తున్నారు. ఈ అంశంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు ట్రంప్​.

Trump remains at Mar-a-Lago
'మర్​-ఏ-లగో' నిబంధనలను ఉల్లంఘించిన ట్రంప్​

శ్వేత సౌధాన్ని వీడిన అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. సౌత్ ఫ్లోరిడా పామ్​​ బీచ్​లోని మర్​-ఏ-లాగో క్లబ్​కు తన నివాసాన్ని మార్చారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే.. మర్​-ఏ-లాగో క్లబ్​కు సంబంధించి పామ్​​ బీచ్ టౌన్​తో చేసుకున్న​ 1993 నాటి ఒప్పందాన్ని ఆయన ఉల్లంఘించారని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం వరుసగా ఏడు రోజులు లేదా.. ఏడాదికి 21 రోజులకు మించి ఈ భవనంలో ఉండేందుకు వీలు లేదు.

అయితే.. మర్​-ఏ-లాగో క్లబ్​లోనే ట్రంప్​ నివసించేందుకు అనువుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. క్లబ్​ నిబంధనలపై ఫిబ్రవరిలో జరగనున్న కౌన్సిల్​ సమావేశంలో చర్చిస్తామని పామ్​​ బీచ్ టౌన్​ మేనేజర్​ క్రిక్​ బోలిన్​ గురువారం ఓ ఈ మెయిల్​ ద్వారా తెలిపారు.

మర్​-ఏ-లాగో క్లబ్​కు పొరుగున నివాసం ఉండే ఓ వ్యక్తి నుంచి పామ్​ బీచ్​కు గతవారంలో ఓ లేఖ వచ్చింది. ఈ క్లబ్​ ఆస్తి విలువను ట్రంప్​.. తగ్గించేందుకు యత్నిస్తున్నారని సదరు వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. 2019లోనే ట్రంప్​, ఆయన భార్య మెలనియా ట్రంప్​.. తమ నివాసాన్ని న్యూయార్క్​ నుంచి మర్​-ఏ-లాగోకు మార్చారు. మర్​-ఏ-లాగోలో ట్రంప్​ నివసించకుండా నిషేధం విధించడానికి ఎలాంటి నిబంధనలు లేవని గతనెలలో ట్రంప్​ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలవడం గమనార్హం.

అసలేంటీ మర్​-ఏ-లాగో?

126 గదులు ఉండే​ ఈ మర్​-ఏ-లాగో భవంతిని 1985లో పది మిలియన్ల డాలర్లకు జనరల్​ ఫూడ్స్​ యజమాని వద్ద నుంచి ట్రంప్​ కొనుగోలు చేశారు. ట్రంప్​ దీన్ని కొనుగోలు చేసిన అనంతరం ఈ ఇంట్లో నివిసిస్తూనే మరమ్మతుల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే 1990లో తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న ట్రంప్​.. ఈ ఇంటిని పోర్షన్లుగా విభజించి అమ్మాలని యత్నించారు. కానీ, దీనికి పామ్​ బీచ్​ టౌన్​ నిరాకరించింది.

1993లో మర్​-ఏ-లాగోను ప్రైవేట్​ క్లబ్​గా మార్చడానికి టౌన్​తోపాటు, ట్రంప్​ అంగీకరించారు. ఇందులో 500 మంది అతిథులు మాత్రమే ఉండాలని టౌన్​ నిబంధనలు విధించింది. వరుసగా ఏడు రోజులు లేదా సంవత్సరానికి 21 రోజులు మాత్రమే ఉండాలని తెలిపింది. ఈ షరతులు ట్రంప్​కు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.

తరుచూ ఉల్లంఘించారు..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందు.. ఈ ఇంట్లో ఎన్నిరోజులు నివసించారనే దానికి స్పష్టత లేదు. ట్రంప్ తన పదవీకాలంలో మాత్రం​ తరుచూ ఈ 21 రోజుల నిబంధనలు ఉల్లంఘించారని 'మర్​-ఏ-లాగో ఇన్​సైడ్​ ది గేట్స్​ ఆఫ్ ది పవర్​ ఎట్​ డొనాల్డ్​ ట్రంప్​ ప్రెసిడెన్షియల్​ ప్యాలెస్'​ పుస్తక రచయిత లారెన్స్​ లీమర్ ఆరోపించారు. 2006లో ట్రంప్​ ఈ భవంతిలో అనుమతుల్లేకుండానే 80 అడుగుల పొడవైన అమెరికా పతాకాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పారు.

మర్​-ఏ-లాగో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని అనేక సార్లు ట్రంప్​నకు వ్యతిరేకంగా మర్​-ఏ-లాగో చుట్టుపక్కల వాళ్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ నవంబర్​లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ అక్కడ 62 శాతం ఓట్లను గెలుచుకున్నారు.

ఇవీ చదవండి:

ట్రంప్ యూట్యూబ్​ ఛానల్​ మరికొంతకాలం బంద్​

ట్రంప్ కొత్త కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేశారంటే?

Last Updated : Jan 29, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.