ETV Bharat / international

రెండు వారాల్లో 97వేలమంది చిన్నారులకు కరోనా - అమెరికాలో చిన్నారులు

అమెరికాలో.. జులై చివరి రెండు వారాల్లో 97వేలమందికి పైగా చిన్నారులు కరోనా బారినపడినట్టు ఓ నివేదిక పేర్కొంది. ఇప్పటివరకు 3,38,000మందికిపైగా పిల్లలు వైరస్​ బారినపడినట్టు నివేదిక తెలిపింది.

Over 97,000 kids in US tested COVID-19 positive in July
రెండు వారాల్లో 97వేల చిన్నారులకు కరోనా
author img

By

Published : Aug 11, 2020, 9:23 PM IST

అమెరికాలో కరోనా వైరస్​ ఉద్ధృతి ఆందోళనకరంగానే ఉంది. అయితే పిల్లలకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. జులై చివరి రెండు వారాల్లో 97,000కుపైగా మంది చిన్నారులు కరోనా బారినపడినట్టు అమెరికన్​ అకాడమీ ఆఫ్​ పీడియాట్రిక్స్​ అండ్​ చిల్డ్రన్స్​ హాస్పిటల్​ అసోసియేషన్​ నివేదించింది.

జులై 16-30 మధ్య కాలంలో 97,078మంది చిన్నారులకు వైరస్​ నిర్ధరణ అయ్యింది. ఇది 40శాతం ఎక్కువని నివేదిక పేర్కొంది.

కేసుల నమోదవుతున్న రాష్ట్రాల్లో చిన్నారుల ప్రాతినిధ్య కేవలం 8.8శాతమే అయినప్పటికీ.. ఇప్పటివరకు 3,38,000మందికిపైగా పిల్లలు వైరస్​ బారినపడినట్టు నివేదిక తెలిపింది.

ఆసుపత్రి పాలైన కరోనా బాధితుల్లో పిల్లలు 0.6-3.7శాతమని, మొత్తం మృతుల్లో 0-0.8శాతమని నివేదిక వెల్లడించింది.

అమెరికాలో ఇప్పటివరకు 52,54,561కేసులు నమోదయ్యాయి. 1,66,295మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:- రష్యా 'కరోనా వ్యాక్సిన్​' ఎంత సురక్షితం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.