అమెరికాలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా విద్యా సంస్థలు ప్రారంభయ్యాయి. ఈ నేపథ్యంలో వందల మంది విద్యార్థులు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. బుధవారం నాటికి ఒక్క టెనిసీ రాష్ట్రంలోనే దాదాపు 750 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ రాష్ట్రంలోని దాదాపు సగం జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కేసులను గుర్తించే పనిలో ఉన్నామని.. సెప్టెంబర్ 22 నాటికి పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తగ్గిన కేసులు..
అమెరికాలో గత వారం రోజులుగా నిత్యం 40 వేలలోపు కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం మరో 35 వేల మంది వైరస్ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 65 లక్షలు దాటగా.. మరణాల సంఖ్య 1.95 లక్షలకు చేరింది.