ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కొత్త కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 5లక్షల 50వేల మందికి కరోనా సోకింది. మరో 7,702మంది మహమ్మారికి బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 6కోట్ల79లక్షల 3వేల 937కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 15లక్షల 49వేల 620కి పెరిగింది. ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారిలో 4కోట్ల 69లక్షల 90వేల 329మంది కోలుకున్నారు.
కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ పంజా విసురుతోంది. ఒక్క రోజు వ్యవధిలోనే కొత్తగా 1,82,779 మందికి వైరస్ సోకింది. మరో 1,092మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య కోటి 53లక్షల 51వేల 692కి చేరింది. మరణాల సంఖ్య 290,377కి పెరిగింది.
కొత్తగా నమోదైన 24,525 కేసులతో కలిపి బ్రెజిల్లో మొత్తం కేసుల సంఖ్య 66లక్షల 28వేల065కి పెరిగింది. మరణాల సంఖ్య 1,77,388గా ఉంది.
రష్యాలో మొత్తం కేసుల సంఖ్య 24లక్షల 88వేల 912గా నమోదైంది. వైరస్ కారణంగా ఇప్పటివరకు 43,597 మంది మరణించారు.