ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్లమందికి పైగా చిన్నారులు అత్యంత పేదరికంలో ఉన్నట్లు యూనిసెఫ్ తెలిపింది. వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈ చిన్నారుల పరిస్థితులు మరింత కఠినంగా మారే ప్రమాదం ఉందని యూనిసెఫ్ పేర్కొంది. దుర్భర పేదరికం అనుభవిస్తున్న చిన్నారులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరం ఉందని కోరింది.
సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో మూడింట రెండు వంతుల మంది చిన్నారులు కఠిన పేదరికాన్ని అనుభవిస్తున్నారని తేల్చి చెప్పింది యూనిసెఫ్. అక్కడి వారి సగటు ఆదాయం రోజుకు 1.90 డాలర్లుగా ఉందని తెలిపింది. అయితే 2013 నుంచి 2017 మధ్య అత్యంత పేదరికంలో నివసిస్తున్న వారి సంఖ్య 29 మిలియన్ల మేర తగ్గిందని పేర్కొంది.