అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతున్నవేళ ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
" 2020 మనల్ని చాలా రకాలుగా పరీక్షించింది. ప్రజలంతా పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎలా ముందుకొచ్చారో మనం చూశాం. 2021లో ఆశాభావంతో ముందుకెళ్లండి. మంచి రోజులు ముందున్నాయి. "
--బరాక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు
ఓ హై స్కూల్ విద్యార్థి ట్యూషన్ ఫీజు కోసం ఖైదీలు ఎలా డబ్బును సేకరించారో తన ఆర్టికల్‌లో తెలిపారు ఒబామా. ఈ ఆర్టికల్‌ను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఈ కథనం అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ నినాదం 'యునైట్, హీల్, రీబిల్డ్'కు నిదర్శనమని వివరించారు. మంగళవారం జార్జియా సెనేట్‌కు ఎన్నికలు జరుగుతున్నందున డెమొక్రటిక్ అభ్యర్థులకు తన మద్దతు తెలిపారు.
అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రెండు కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల 40వేల మందికి పైగా మరణించారు.
ఇదీ చదవండి: ఎన్నికల ఫలితాలపై ఈ నెల 6న ట్రంప్ అనుచరుల ర్యాలీ