ETV Bharat / international

అమెరికాలో 10 కోట్ల మందికి వ్యాక్సిన్

author img

By

Published : May 1, 2021, 3:17 PM IST

Updated : May 1, 2021, 3:37 PM IST

అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 10 కోట్ల మంది టీకా రెండు డోసులు అందుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం శుక్రవారం వెల్లడించింది. టీకా పంపిణీ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పర్యటక ప్రదేశాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అనుమతించాయి.

Americans, vaccinated
అగ్రరాజ్యంలో 10 కోట్ల మందికి పైగా టీకా

టీకా పంపిణీలో అమెరికా కీలక మైలు రాయిని దాటింది. ఇప్పటివరకు 10 కోట్ల మందికి పైగా అమెరిన్లుకు టీకా రెండో డోసులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

అమెరికాలో కొవిడ్​ టీకా రెండు డోసులు పొందిన వారి సంఖ్య 10 కోట్లు దాటిందని శుక్రవారం శ్వేతసౌధం వెల్లడించింది. 18 ఏళ్లు దాటిన వారిలో ఇప్పటివరకు 39 శాతం మంది రెండు డోసులూ తీసుకున్నారని, అయితే తొలి డోసు తీసుకున్న వారిలో 8 శాతం మంది ఇంకా రెండో డోసు తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. వ్యాక్సిన్​ పంపిణీని మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేసింది.

వ్యాక్సినేషన్​ జోరుగా సాగుతున్న క్రమంలో ప్రముఖ పర్యటక ప్రదేశమైన డిస్నీలాండ్​ను శుక్రవారం తిరిగి ప్రారంభించారు. దక్షిణ కాలిఫోర్నియాలో ఉండే ఈ థీమ్​ పార్క్​ 13 నెలలు తరువాత ప్రారంభం కావడం వల్ల అక్కడి సందర్శకుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. అయితే 25 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు సాగించడం సహా స్థానికులకు మాత్రమే అనుమతించడం వంటి ఆంక్షలను అక్కడి ప్రభుత్వాలు విధించాయి.

ఇదీ చూడండి: అమెరికా ఆంక్షలు- కొన్ని వర్గాలకు మినహాయింపు!

Last Updated : May 1, 2021, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.