అమెరికా నార్త్ కరోలినాలోని ఓ మెకానిక్‌ను అదృష్టం వరించింది. లాటరీలో దాదాపు 2 లక్షల డాలర్లను(దాదాపు రూ.1.5 కోట్లు) అతడు గెలుచుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులతో తన కుటుంబ కలలను తీర్చాలని అతడు ఆశపడుతున్నాడు.
ఆ విషయమే మరిచిపోయినా...
ఫ్రాంక్‌విల్లే ప్రాంతానికి చెందిన గ్రెగరీ వారెన్.. సెప్టెంబరు 29న ఓ చోట గ్యాస్ ఫిల్లింగ్ చేయడానికి వెళ్లి, అక్కడ 'క్యాష్ 5 లాటరీ' టికెట్టును కొనుగోలు చేశాడు. కానీ, అక్టోబరు 4వరకు అతడు ఆ టికెట్ సంగతే పట్టించుకోనే లేదు. కానీ, అనూహ్యంగా అతడు కొనుగోలు చేసిన టికెట్టే లాటరీలో జాక్‌పాట్ గెలుచుకుంది. 391,870 డాలర్ల ఈ మొత్తం లాటరీ బహుమతిలో అతడు సగం డబ్బులను(195,935 డాలర్లు) గెలుచుకున్నాడు.
"నేను తరుచూ లాటరీ టికెట్లను కొనగోలు చేయను. అనుకోకుండా ఆ రోజు దాన్ని కొనుగోలు చేశాను. కానీ, నేను దాని గురించే మరిచిపోయాను. చివరకు నేనే ఆ లాటరీలో గెలిచానన్న విషయం తెలిశాక ఎంతో ఆశ్చర్యపోయాను. ఈ విషయం విని, రాత్రంతా అస్సలు నిద్ర పట్టలేదు"
-గ్రెగరీ వారెన్, లాటరీ విజేత
పన్నుల తర్వాత.. 138,624 డాలర్ల చెక్‌ను లాటరీ నిర్వాహకుల నుంచి మంగళవారం అందుకున్నాడు వారెన్. తనకు వచ్చిన ఈ డబ్బులను తన కుటుంబ కోసం, వ్యాపారం కోసం వినియోగిస్తానని చెప్పాడు అతడు. "నాకు 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు నేను ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నాను. నా కుమారుడు హైస్కూల్ చదువు పూర్తి చేసి, గ్రాడ్యుయేషన్‌కు చేరుకునే సరికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి" అని వారెన్ తెలిపాడు.
ఈ లాటరీ డ్రాలో మరో సగం జాక్‌పాట్‌ను ఓ మహిళ దక్కించుకుంది.
ఇవీ చూడండి: