ETV Bharat / international

నేనంటే ఎవరికీ ఇష్టం లేదు: ట్రంప్​ - whitehouse news updates

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలు... అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కంటే తనను ఎందుకు తక్కువ ఇష్టపడుతున్నారో అని ప్రశ్నించారు ట్రంప్​. తానంటే ఎవరికీ ఇష్టం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతలోనే సర్దుకుని... తన వ్యక్తిత్వమే అటువంటిదని సమర్థించుకొన్నారు. దీంతో ట్రంప్​... స్వీయ విమర్శ చేసుకున్నట్లైంది.

Nobody likes me says America president Donald Trump
నేనంటే ఎవరికీ ఇష్టం లేదు: ట్రంప్‌
author img

By

Published : Jul 29, 2020, 2:28 PM IST

దూకుడుగా ఉండే తన వ్యవహార శైలికి భిన్నంగా.. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ నిష్పక్షపాతంగా స్వీయ విమర్శ చేసుకున్న అరుదైన సందర్భం తాజాగా చోటుచేసుకుంది. శ్వేత సౌధంలో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో... అమెరికా ప్రజలు అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కంటే తనను ఎందుకు తక్కువ ఇష్టపడుతున్నారో అని ఆయన ప్రశ్నించారు. తానంటే ఎవరికీ ఇష్టం లేదని ట్రంప్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

"ఫౌచీని మా ప్రభుత్వమే నియమించింది. కొవిడ్‌-19 నియంత్రణకై డాక్టర్‌ ఫౌచీ, డాక్టర్‌ బిర్క్స్‌ సహా వైద్య నిపుణుల బృందం సూచనలనే మా ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే, కరోనా విషయంలో ఫౌచీకి అమిత ప్రజాదరణ లభిస్తోంది. అసలు నాకే అత్యధిక మద్దతు రావాల్సి ఉండగా.. విమర్శలు ఎందుకు ఎదురౌతున్నాయో అర్థం కావటం లేదు. మా (ప్రభుత్వం) కోసం పనిచేసే వ్యక్తికి ప్రజాదరణ లభిస్తుండగా... నన్ను ఎవరూ ఇష్టపడకపోవడానికి నా వ్యక్తిత్వమే కారణం. అంతే."

- డొనాల్డ్ ​ట్రంప్

అమెరికాలో కరోనా వైరస్‌ కట్టడికోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌లో సభ్యుడుగా ఉన్నారు ఫౌచీ. అమెరికా ప్రభుత్వం, ప్రజలు కొవిడ్‌ విషయంలో ఫౌచీ సలహాలు, సూచనలను ఎంతో నమ్మకంగా పాటిస్తున్నారు. అయితే మహమ్మారిని కట్టడి చేయటంలో విఫలమైనందుకు ట్రంప్‌ ఇటీవల విమర్శలను ఎదుర్కొంటున్నారు.

కరోనా వైరస్‌కు లక్షా యాభైవేల మందికి పైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశాధ్యక్షుడిని కూడా ఖాతరు చేయకుండా తన అభిప్రాయాలను నిష్పక్షపాతంగా వ్యక్తం చేయటంలో పేరుగాంచిన ఫాచీ వైఖరి గత కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ స్థానంలో ఫౌచీనే ఉండాల్సిన అవసరం లేదని.. తాము వేరే ఎవరినైనా నియమించుకోగలమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించటం కొసమెరుపు!

ఇదీ చూడండి: హైడ్రాక్సీ క్లోరోక్విన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది: ట్రంప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.