ETV Bharat / international

కరోనా కాలంలోనూ జోరుగా ఆయుధాల వ్యాపారం! - బోయింగ్

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న రక్షణ రంగ సంస్థలు మెరుగ్గా రాణించాయి. 2020 ఏడాదిలో అమెరికాకు చెందిన పది అతిపెద్ద సంస్థల్లో ఆరు కంపెనీల రెవెన్యూ కనీసం 6 శాతం పెరిగింది. భారత్​కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రెవెన్యూ సైతం 2019తో పోలిస్తే 11 శాతం అధికమైంది.

No pandemic impact as top defence firms get richer in 2020
కరోనా కాలంలోనూ జోరుగా ఆయుధాల వ్యాపారం!
author img

By

Published : Jul 13, 2021, 5:31 PM IST

ప్రపంచంలోని అనేక రంగాలపై కరోనా ఎనలేని ప్రభావం చూపింది. ఎన్నో సంస్థలు అనేక నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే అన్నింటికీ మినహాయింపు ఉన్నట్లే.. కరోనా సమయంలోనూ భారీగా వృద్ధి చెందిన రంగాలు ఉన్నాయి. అందులో ఆయుధ తయారీ రంగం ఒకటి.

అవును.. 2020లో ఈ రంగం కొత్తపుంతలు తొక్కింది. ఆయుధాలు, మిలిటరీ వ్యవస్థలు, పరికరాలు తయారు చేసే సంస్థలు ఈ కాలంలో గణనీయంగా వృద్ధి సాధించాయి. 'డిఫెన్స్​న్యూస్' అనే వెబ్​సైట్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 100 డిఫెన్స్ సంస్థల్లో అనేకం లాభాల్లోనే పయనించాయి. ఈ జాబితాలో అమెరికా, చైనా దేశాలదే హవా. అతిపెద్ద 20 రక్షణ సంస్థల్లో ఎనిమిది అమెరికా, ఏడు చైనాలవే కావడం.. ఈ రంగంలో ఆయా దేశాల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది. ఇటలీ, రష్యా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఒక్కో సంస్థకు ఇందులో చోటు దక్కింది. ఫ్రాన్స్-నెదర్లాండ్స్ దేశాల జాయింట్ వెంచర్ సంస్థకు సైతం స్థానం లభించింది.

భారీగా పెరిగిన రెవెన్యూ

2020 ఏడాదిలో అమెరికాకు చెందిన పది అతిపెద్ద సంస్థల్లో ఆరు కంపెనీల రెవెన్యూ కనీసం 6 శాతం పెరిగింది. దాదాపు 11 బిలియన్ డాలర్లను ఇవి వెనకేసుకున్నాయి. చైనా కంపెనీలు సైతం మెరుగ్గా రాణించాయి.

ఈ జాబితా ప్రకారం అమెరికాలోని ఐదు ఉత్తమ రక్షణ రంగ కంపెనీలు ఇవే..

  1. లాక్​హీడ్ మార్టిన్
  2. రేథియాన్ టెక్నాలజీస్
  3. బోయింగ్
  4. నార్త్​రాప్ గ్రూమన్
  5. జనరల్ డైనమిక్స్

చైనాలో లీడింగ్ డిఫెన్స్ కంపెనీలు:

  1. ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా
  2. చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్
  3. చైనా స్టేట్ షిప్​బిల్డింగ్ కార్పొరేషన్
  4. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్

భారత్​ నుంచి...

టాప్ 100 జాబితాలో భారత్​ నుంచి రెండు సంస్థలు ఉన్నాయి. దేశీయ దిగ్గజ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 41వ స్థానంలో నిలిచింది. గతేడాది(45)తో పోలిస్తే నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు. గతేడాది తరహాలోనే ఈసారీ 61వ స్థానాన్ని దక్కించుకుంది.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రెవెన్యూ మాత్రం భారీగా పెరిగింది. 2019తో పోలిస్తే 11 శాతం అధికమైంది. మరోవైపు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్.. 4 శాతం రెవెన్యూను పెంచుకుంది.

వేగంగా వృద్ధి

వందో ర్యాంకులో ఉన్న కంపెనీ రెవెన్యూ గతేడాది 300 మిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈ సారి ఆ ర్యాంకు దక్కించుకున్న సంస్థ రెవెన్యూ 600 మిలియన్ డాలర్లుగా నమోదైంది. దీన్ని బట్టి ఈ రంగం రెట్టింపు వేగంతో దూసుకెళ్తోందని అర్థమవుతోంది. 5 బిలియన్ డాలర్ల రెవెన్యూ ఉన్న కంపెనీల సంఖ్య పదేళ్ల క్రితం 15గా ఉండేది. తాజాగా ఈ సంఖ్య 24కు పెరిగింది.

ఈ సంస్థలు మరింత అధునాతన సాంకేతికతలపై దృష్టిసారిస్తున్నాయి. సంప్రదాయ యుద్ధాలతో పాటు భవిష్యత్ పోరాటాలను దృష్టిలో పెట్టుకొని.. సైబర్, స్పేస్, శాటిలైట్ ఇమేజినరీ వంటి టెక్నాలజీ డొమైన్లపై కన్నేస్తున్నాయి.

(సంజీవ్ బారువా- సీనియర్ పాత్రికేయులు)

ఇవీ చదవండి:

Submarine: భారత జలాల్లోకి కొత్త 'సొరలు'

చైనా ఆయుధాలు కొనేందుకు దేశాల వెనకడుగు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.