ETV Bharat / international

'వచ్చే 4-6 నెలలు కరోనా మరింత తీవ్రం'

ప్రపంచ దేశాలకు కంటిపై కునుకు లేకుండా కరోనా పట్ల రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​. వచ్చే 4-6 నెలల్లో వైరస్​ తీవ్రరూపం దాల్చే అవకాశమున్నట్టు పరిశోధనల్లో తేలిందని చెప్పారు. అయితే.. కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా  పాటించడం వల్ల మహమ్మారి వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు గేట్స్​.

NEXT FOUR TO SIX MONTHS COULD BE WORST OF COVID-19 PANDEMIC: BILL GATES
వచ్చే 4-6 నెలలు కరోనా మరింత తీవ్రం: గేట్స్‌
author img

By

Published : Dec 14, 2020, 12:17 PM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో మరింత తీవ్రంగా మారే అవకాశముందని మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​ అన్నారు. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే నిబంధనలు కచ్చితంగా పాటిస్తే కొవిడ్‌ ముప్పును అరికట్టవచ్చని.. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు గేట్స్.

"విచారకరమైన విషయమేంటంటే... రానున్న 4-6 నెలల్లో కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ అంచనాల మేరకు మరో 2లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. అయితే మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ఈ మరణాల శాతాన్ని తగ్గించవచ్చు. ఇలాంటి మహమ్మారి గురించి 2015లోనే నేను హెచ్చరించాను. మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాను. అయితే.. అమెరికా సహా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలపై కొవిడ్‌ ప్రభావం నేను అంచనా వేసినదానికంటే తక్కువగానే ఉండటం ఆనందకరం." అని బిల్‌గేట్స్‌ చెప్పుకొచ్చారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాల కోసం బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ సంపూర్ణ సహకారం అందిస్తోందని గేట్స్‌ ఈ సందర్భంగా తెలిపారు.

ఇదీ చదవండి: 'ఊపిరితిత్తుల కణాలను హైజాక్​ చేస్తున్న కరోనా'

బహిరంగంగానే టీకా తీసుకుంటా..

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌, జార్జ్‌ బుష్‌, బరాక్‌ ఒబామాల్లాగే తానూ బహిరంగంగానే టీకా తీసుకుంటానని బిల్‌గేట్స్‌ చెప్పారు. వైద్యపరమైన అవసరాల వల్లే వ్యాక్సిన్​ తీసుకుంటున్నామని, అంతేగానీ ఇందులో సంపన్న, పేద తేడాలేమీ లేవని తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ అమెరికన్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు గేట్స్. మాస్క్‌ ధరించడం పెద్ద ఖర్చేమీ కాదని, నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు.

ప్రస్తుతం అమెరికాలో అధికార మార్పిడి జరుగుతున్నందున కరోనా మహమ్మారిపై పోరు కొంచెం సవాలుగా మారిందని గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే.. కొత్త ప్రభుత్వంలో పరిస్థితులు మారొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. పండగల నేపథ్యంలో ప్రజలు నిబంధనలను నిర్లక్ష్యం చేయడం వల్ల.. వైరస్‌ తీవ్రమైందని నిపుణులు వెల్లడించారు.

అగ్రరాజ్యంలో ఇప్పటివరకు 1.67 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. వారిలో 3 లక్షల 6వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: అమెరికా.. ఊపిరి పీల్చుకో- నేడే టీకా పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.