ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 31లక్షలకు చేరువలో కరోనా కేసులు - కరోనా వైరస్​ కేసులు

ప్రపంచంపై కరోన వైరస్​ పంజా కొనసాగుతోంది.ఇప్పటి వరకు 30,84,740 వైరస్​ కేసులు నమోదయ్యాయి. 2,12,516మంది మరణించారు. అయితే అమెరికాలోని న్యూయార్క్​లో మరణాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఫ్రాన్స్​, స్పెయిన్​ వంటి దేశాలు లాక్​డౌన్​ ఎత్తివేతకు ప్రణాళికలు రచిస్తున్నాయి. న్యూజిలాండ్​లో కేవలం ముడు కేసులే నమోదయ్యాయి. కానీ బ్రెజిల్​లో పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి.

New Zealand tames virus; France, Spain reveal lockdown exits
లాక్​డౌన్​ ఎత్తివేత వైపు ఆ దేశాల అడుగులు!
author img

By

Published : Apr 28, 2020, 7:28 PM IST

గత కొద్ది నెలలుగా కరోనా వైరస్​తో విలవిలలాడుతున్న ఫ్రాన్స్​, స్పెయిన్ దేశాల్లో పరిస్థితి కొంతమేర మెరుగుపడింది. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ ఎత్తివేతకు ఆయా దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అమెరికాలో వైరస్​ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. న్యూజిలాండ్​, ఆస్ట్రేలియాలో అతి తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అయితే బ్రెజిల్​ దేశం తాజాగా వైరస్​కు కేంద్ర బిందువుగా మారినట్టు కనిపిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 30,84,740 వైరస్​ కేసులు నమోదయ్యాయి. 2,12,516మంది మరణించారు. 9.34లక్షల మంది కోలుకున్నారు.

దేశంకేసులుమరణాలు
అమెరికా1,010,60456,821
స్పెయిన్​232,12823,822
ఇటలీ199,41426,977
ఫ్రాన్స్​165,84223,293
జర్మనీ158,7686,136
బ్రిటన్​157,14921,092
బ్రెజిల్​67,4464,603
బెల్జియం47,3347,331
నెదర్లాండ్స్​38,4164,566

పాఠశాలు తెరిచేందుకు ఇక్కట్లు...

మే 11 కల్లా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను తెరిచేందుకు ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​ ప్రణాళికలు రచిస్తున్నారు. నిపుణులు కూడా కరోనా వైరస్​ ప్రభావం పిల్లల్లో తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. టీచర్లు కూడా స్కూళ్లకు వెళ్లడానికి సిద్ధంగా లేరు. సామాజిక దూరం పాటించమని, చేతులను శుభ్రంగా కడుక్కోమని చెప్పగలమే కానీ.. ప్రతీసారీ పిల్లలను పర్యవేక్షించడం కష్టమని అంటున్నారు. అయితే పాఠశాలలు తెరుచుకోకుండానే.. ఉద్యోగాలకు వెళ్లాల్సి వస్తే తల్లిదండ్రులకు కష్టమైన విషయమే. ​​

మరణాలు తగ్గాయి...

అమెరికాలో వైరస్​కు కేంద్రబిందువుగా మారిన న్యూయార్క్​లో మరణాలు తగ్గుముఖం పట్టాయి. అటు న్యూజెర్సీలోనూ ఇదే పరిస్థితి నెలకొనడం వల్ల ఇరురాష్ట్రాల గవర్నర్లు జనజీవనం పునరుద్ధరణకు ప్రణాళికలు రచిస్తున్నారు.

న్యూయార్క్​లో మే 15తో లాక్​డౌన్​ ముగియనుంది. ఆ తర్వాత.. వైరస్​ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాలు, ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్​ కౌమో యోచిస్తున్నారు. అయితే న్యూయార్క్​లోని అనేక ప్రాంతాలు మే 15 తర్వాత కూడా లాక్​డౌన్​లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వైద్య సదుపాయాలు లేక...

బ్రెజిల్​లో ఇప్పటివరకు 67వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 4వేల 600మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇవన్నీ నిజమైన లెక్కలు కావని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో సరైన వైద్య పరికరాలు లేనందున పరీక్షల నిర్వహణ సరిగ్గా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య భారీగా పెరగడం వల్ల అనేక హాస్పిటళ్లు చికిత్స అందించలేక ఇప్పటికే చేతులెత్తేశాయి.

దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. అధ్యక్షుడు బొల్సొనారో మాత్రం వీటిని తీవ్రంగా పరిగణించడం లేదని సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.

'నిశితంగా పర్యవేక్షిస్తున్నాం..'

పాకిస్థాన్​లో కరోనా వైరస్​ ఉద్ధృతిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ వెల్లడించారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే పాక్​లో పాజిటివ్​ కేసులు, మరణాలు తక్కువగా ఉన్నాయని అభిప్రయపడ్డారు.

పాక్​లో ఇప్పటివరకు 1,57,223మందికి పరీక్షలు నిర్వహించగా.. 14,079మందికి వైరస్​ సోకింది. వీరిలో 301మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే ఇమ్రాన్​ ఖాన్​ సహచరుడు, దక్షిణ సింధు​ రాష్ట్ర గవర్నర్​ ఇమ్రాన్​ ఇస్మాయల్​కు కరోనా పాజిటివ్​గా తేలింది.

ఇక్కడ ఇలా...

సింగపూర్​లో తాజాగా 528 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది విదేశీ కార్మికులేనని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భారతీయులు కూడా ఉన్నారని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14వేల 951మందికి వైరస్​ సోకింది.

కేవలం మూడే కేసులు...

న్యూజిలాండ్​లో మంగళవారం కేవలం మూడు కేసులే నమోదయ్యాయని ఆ దేశ ప్రధాని జెసిండ్​ ఆర్డెర్న్​ ప్రకటించారు. వైరస్​ కట్టడిలో ప్రజలే కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.