ETV Bharat / international

'విదేశీ విద్యార్థులను దేశంలోకి అనుమతించం' - US new visa policy

వీసా విధానంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా. పూర్తిగా ఆన్​లైన్​ మాధ్యమంలో మాత్రమే బోధనను ఎంచుకుంటున్న విద్యార్థులను ఇకపై అనుమతించేది లేదని స్పష్టం చేసింది ట్రంప్​ సర్కార్​.

New foreign students who opted for all online classes will not be allowed
విదేశీ విద్యార్థులను దేశంలోకి అనుమతించేది లేదు!
author img

By

Published : Jul 25, 2020, 3:53 PM IST

వీసా విధానంలో కొత్త కొత్త మార్పులు తెస్తోన్న అమెరికా ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం ప్రకటించింది. పూర్తిగా ఆన్‌లైన్‌ మాధ్యమంలో బోధనను ఎంచుకుంటున్న విద్యార్థులను ఇకపై దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశంలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులను వెనక్కి పంపాలన్న ఉత్తర్వులను రద్దు చేసిన అగ్రరాజ్యం.. తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

విద్యార్థులకు మద్దతుగా..

కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికాలో ఉంటూ ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న విదేశీ విద్యార్థులను.. వెనక్కి పంపాలన్న ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మొత్తం ఎనిమిది వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దాదాపు 200 పైగా విద్యా సంస్థలు వీటిపై సంతకాలు చేశాయి. హార్వర్డ్‌, ఎంఐటీ వంటి దిగ్గజ విశ్వవిద్యాలయాలు ఈ విషయంపై న్యాయస్థానాలను ఆశ్రయించాయి. వీరికి సాంకేతిక దిగ్గజ సంస్థలైన గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలూ మద్దతుగా నిలిచాయి.

కరోనా వ్యాప్తి కొనసాగుతున్న క్లిష్ట పరిస్థితిలో ఆన్‌లైన్‌ తరగతులపై ఉన్న పరిమితుల్ని ఎత్తివేస్తూ.. మార్చి 13న ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐసీఈ) తీసుకున్న నిర్ణయానికి ట్రంప్‌ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని ఆయా సంస్థలు ఆరోపించాయి. ట్రంప్ నిర్ణయంతో ఎఫ్‌-1 వీసాపై అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులతో పాటు, ఎం-1 వీసాపై వృత్తివిద్యా కోర్సులు అభ్యసిస్తున్నవారు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఎట్టకేలకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అందుకే ఈ నిర్ణయం!

ఆన్​లైన్​ మాధ్యమం ఎంచుకునే కొత్త విద్యార్థులకు మాత్రం తాజాగా షాకిచ్చారు డొనాల్డ్​ ట్రంప్​. కరోనా వల్ల మూతపడ్డ విద్యాసంస్థల్ని ఎలాగైనా తెరిపించాలన్న దురుద్దేశంతోనే.. అమెరికా అధ్యక్షుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

ఇదీ చూడండి: 4 దశాబ్దాల తర్వాత ఆ చైనా కాన్సులేట్​ మూసివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.