అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. శ్వేతసౌధంలో ఉన్నత పదవుల్లో ఒకటైన ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) డైరెక్టర్ పదవికి వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు భారతీయ అమెరికన్ నీరా టాండన్. ఓఎంబీ పదవికిగానూ ఆమెను ధ్రువీకరించడానికి సెనేట్‌లో తగినన్ని ఓట్లు రాబట్టడంలో బైడెన్ సర్కార్ విఫలమైంది. ఫలితంగా నీరా ఈ నిర్ణయం తీసుకున్నారు.
సామాజిక మాధ్యమాల్లో నీరా వ్యవహార శైలి సరిగా లేదని మొదటి నుంచీ రిపబ్లికన్లు సహా సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు విమర్శిస్తున్నారు. ఈ కారణంగానే సెనేట్‌లో ఆమె ధ్రువీకరణకు తగినన్ని ఓట్లు రాలేదని తెలుస్తోంది. దీంతో నీరా ఉపసంహరణను బైడెన్ ఆమోదించారు. అయితే టాండన్ తన ప్రభుత్వంలో కొనసాగుతారని బైడెన్ పేర్కొన్నారు.
బైడెన్ కెబినేట్‌లో 23 మంది సభ్యులుండగా.. అందులో 11 మందికి బలమైన మద్దతు ఉంది. అయితే నీరా నామిషనేషన్ ఉపసంహరించుకోవడం వల్ల బైడెన్ మద్దతు తెలిపిన ఉన్నత స్థాయి వ్యక్తుల్లో ఒకరు వైదొలిగినట్లు అయింది.
ఇవీ చూడండి: