భానుడి భగభగలకు అమెరికా అల్లాడిపోతోంది. న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా సహా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను తాకుతున్నాయి. ఎండల ధాటికి ఈ వారంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వేడి గాలులకు దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ఉక్కిరిబిక్కరి అవుతున్నారు.
భారీ ఉష్ణోగ్రతలు, తేమ నుంచి తగిన రక్షణ పొందకపోతే వడదెబ్బ తగిలే అవకాశముందని ఆ దేశ జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారమూ భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని స్పష్టం చేసింది.
న్యూయార్క్ విలవిల...
న్యూయార్క్‌లో 500 ఉపసమన కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఎండల భయానికి న్యూయార్క్‌లో ఆదివారం జరగాల్సిన 'ట్రైయాత్లాన్' వేడుకను అధికారులు రద్దు చేశారు. అలానే సెంట్రల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్ట్, మ్యూజిక్ ఈవెంట్‌నూ నిలిపివేశారు.
ఫిలడెల్ఫియాలో శనివారం భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1930 అనంతరం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి.
ఇదీ చూడండి:- ఆరేళ్ల లిటిల్ కోచ్‌కు కోపమొస్తే...?