సూర్యుడి పదేళ్ల జీవితకాలానికి సంబంధించిన అద్భుత వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. 2010-2020 మధ్య సూర్యుడి పూర్తిగమనాన్ని గంట నిడివితో అందించింది.
నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్‌డీఓ) సూర్యుడిని దశాబ్దకాలంగా పరిశీలిస్తోంది. భూమి చుట్టూ పరిభ్రమిస్తూనే అత్యుత్తమ నాణ్యతతో 425 మిలియన్ల సూర్యుడి చిత్రాలను సేకరించింది. వాటన్నిటినీ ఏకం చేసి గంట నిడివి వీడియోను ఆవిష్కరించామని నాసా తెలిపింది.
ధగధగ మెరిసిపోతున్న భానుడు
మనకు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుడే. సౌర వ్యవస్థపై ఆ తార ప్రభావాన్ని శాస్త్రవేత్తలు అర్థం చేసుకొనేందుకు ఈ 11 ఏళ్ల సౌరచక్రం సాయపడనుంది. నాసా ప్రకారం సూర్యుడి అయస్కాంత క్షేత్రం ఒక భ్రమణం పూర్తి చేస్తే దానిని సౌర చక్రంగా పరిగణిస్తారు. ప్రతి 11 ఏళ్లకు సూర్యుడి అయస్కాంత క్షేత్రం పూర్తిగా తలకిందులవుతుంది. ఉత్తర, దక్షిణ ధ్రువాలు స్థానాలు మార్చుకుంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నాసా ట్వీట్‌చేసిన ఈ అద్భుత వీడియోకు లక్షల్లో వీక్షణలు లభిస్తున్నాయి. సువర్ణ వర్ణంలో ధగధగా మెరిసిపోతున్న సూర్యుడిని చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు.
ఇదీ చూడండి: అమెరికా నిఘా విమానాలను అడ్డుకున్న రష్యా