ETV Bharat / international

భూమి దిశగా దూసుకొస్తున్న పాత రాకెట్: నాసా​

భూమికి చేరువలో కనిపించిన ఓ ఖగోళ వస్తువును గ్రహశకలం కాదని స్పష్టం చేసింది నాసా. 1966 నాటి వ్యోమనౌక అని తెలిపింది. అంతరిక్షంలో వ్యర్థ పదార్థంగా మిగిలిపోయిన ఆ నౌక తిరిగి సూర్యుని కక్ష్యలోకి వెళ్లవచ్చని అంటున్నారు నాసా పరిశోధకులు.

NASA expert identifies mystery object as old rocket
భూమి దిశగా దూసుకొస్తోంది పాత రాకెట్: నాసా​
author img

By

Published : Oct 12, 2020, 10:01 AM IST

భూమికి చేరువులో ఇటీవల కనిపించిన ఒక కొత్త 'ఖగోళ వస్తువు'పై అనేక విశ్లేషణలు వెలువడ్డాయి. అదో గ్రహశకలమని, భూ గురుత్వాకర్షణ శక్తి ప్రభావానికి లోను కానుందని, పుడమి కక్ష్యలోనే ఉంటూ రెండో చందమామగా మారనుందన్న సూత్రీకరణలు వెలువడ్డాయి. అయితే అది ఖగోళ వస్తువు కాదని 54 ఏళ్ల నాటి రాకెట్​ శకలమై ఉండొచ్చని ఆమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతుచిక్కని ఒక వస్తువు భూమి దిశగా వస్తున్నట్లు హవాయ్​లోని ఒక టెలిస్కోపు గత నెలలో కనుగొంది. దాన్ని వెంటనే అంతర్జాతీయ ఖగోళశాస్త్ర సంఘానికి చెందిన 'మైనర్ ప్లానెట్​ సెంటర్​' జాబితాలో చేర్చారు. మన సౌర కుటుంబంలో కనిపించే గ్రహశకలాలు, తోకచుక్కల వివరాలు ఇందులో ఉంటాయి. వీటి సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరింది. కొత్తగా కనిపించిన వస్తువుకు '2020 ఎస్​వో' అని శాస్త్రవేత్తలు పేర్లు పెట్టారు. దీని నుంచి పరావర్తనం చెందుతున్న సూర్యకాంతి ఆధారంగా దాని పొడవు సుమారు 26 మీటర్లు ఉండొచ్చని అంచనావేశారు. ఈ నేపథ్యంలో నాసాకు చెందిన సెంటర్​ ఫర్​ నియర్​ ఎర్త్​ ఆబ్జెక్ట్​ స్టడీస్​ డైరెక్టర్​ పాల్​ చోడస్​ దీనిపై దృష్టి సారించారు.

సూర్యుడి చుట్టూ 2020 ఎస్​వో కక్ష్య.. దాదాపుగా వృత్తాకారంలో ఉందని గుర్తించాం. గ్రహశకలం విషయంలో ఇలా జరగడం అసాధారణం. దీనికి తోడు ఆ ఖగోళ వస్తువు, భూమి ఒకే సమతలంలో ఉన్నాయి. అలాగే.. భూమి దిశగా అది గంటకు 2400 కి.మీ వేగంతో దూసుకొస్తోంది. గ్రహశకలం ప్రమాణాల ప్రకారం చూస్తే అది మందగమనంగా ఉంది. మా విశ్లేషణ ప్రకారం చూస్తే 1966 నాటి నాసా 'సెంచార్​ రాకెట్​' శకలమై ఉండొచ్చని అంచనా.

-​ పాల్​ చోడస్, సెంటర్​ ఫర్​ నియర్​ ఎర్త్​ ఆబ్జెక్ట్​ స్టడీస్​ డైరెక్టర్

'సర్వేయర్​-2' వ్యోమనౌకను చంద్రునిపై దిగడానికి ప్రయోగించారు. ఈ వ్యోమనౌక సెంచార్​ను విజయవంతంగా పంపింది. ఆ తరువాత అంతరిక్షంలోనే వ్యర్థ పదార్థంగా మిగిలిపోయింది. మరోవైపు ఇంజన్​ మొరాయించడం వల్ల 'సర్వేయర్​-2'​.. చంద్రుడిపై కూలిపోయింది. నాడు అంతరిక్షం సెంచార్​ రాకెట్​.. చంద్రుడిని దాటి వెళ్లి, సూర్యుడు కక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటినుంచి ఇది కనిపించలేదని, మళ్లీ ఇప్పుడే దర్శనమిస్తోందని పాల్​ చెప్పారు. నాలుగు నెలల పాటు అక్కడే ఉంటుందని, మార్చిలో తిరిగి సూర్యుడి కక్ష్యలోకి ప్రవేశించవచ్చని అంచనా వేశారు.

ఇదీ చూడండి: సెకనుకు 6.68కి.మీ వేగంతో భూమికి చేరువగా గ్రహశకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.