ETV Bharat / international

'మార్స్​ మిషన్​' సమాచారాన్ని ఇస్రోతో పంచుకున్న నాసా - అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా).. 'మార్స్​ మిషన్​' సమాచారాన్ని ఇస్రోతో పాటు మరికొన్ని దేశాలతో పంచుకుంది. ఎవరి కార్యక్రమాలకు ప్రమాదాలు ఎదురవ్వకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

NASA exchanges data of its Mars mission with India, China, UAE & European Space Agency
'మార్స్​ మిషన్​' సమాచారాన్ని ఇస్రోతో పంచుకున్న నాసా
author img

By

Published : Apr 1, 2021, 7:45 AM IST

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా).. 'మార్స్​ మిషన్​'కు సంబంధించిన కొంత సమాచారాన్ని భారత్​కు చెందిన ఇస్రో, చైనాకు చెందిన నేషనల్​ స్పేస్​ అడ్మినిస్ట్రేషన్​లతో పాటు యూఏఈ, యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీలతోనూ పంచుకుంది. తమ వ్యోమనౌకకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఆయా దేశాలు కూడా అంగారకునిపై పరిశోధనలు చేపడుతున్నందున.. ఎవరి కార్యక్రమాలకూ అడ్డంకులు, ప్రమాదాలు ఎదురవ్వకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాసా తెలిపింది.

ఈ మేరకు ఆయా అంతరిక్ష సంస్థలు అంగారకునిపై చేపడుతున్న ప్రయోగాల వివరాలను నాసా కోరింది. 'మార్స్​ ఆర్బిటర్​ మిషన్​(మంగళ్​యాన్​)' పేరుతో ఇస్రో 2013లో పంపిన ప్రోబ్​ ఇప్పటికే అంగారకుని కక్ష్యలో తిరుగుతోంది. నాసా పంపిన 'వర్సెవరెన్స్​' గత నెలలో అంగారకునిపై అడుగు పెట్టింది. అందులోని రోవర్​ ప్రస్తుతం అక్కడి ఉపరితలంపై తవ్వకాలు చేపడుతోంది. చైనా, యూఏఈ, యూరోపియన్​ స్పేస్​ ఏజెన్సీలు కూడా అంగారక కార్యక్రమం చేపట్టి.. ఇప్పటికే వ్యోమనౌకలు పంపాయి.

ఇదీ చదవండి: అంతరిక్ష రంగంలో సహకారానికి ఇస్రో కసరత్తు

చైనాతో వద్దనుకున్నా...

తమ సాంకేతికత పరిజ్ఞానాన్ని చైనా చౌర్యం చేస్తోందని కొంతకాలంగా మండిపడుతున్న అగ్రరాజ్యం.. మార్స్​ మిషన్ విషయంలో మాత్రం ఆ దేశంతో సమాచారం పంచుకోక తప్పలేదు. ఉభయ దేశాలు అంగారకుని వద్దకు వ్యోమనౌకలు పంపిన క్రమంలో.. పరస్పర ప్రయోగాల కారణంగా అక్కడ తమ కార్యక్రమాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకూడదని నిర్ణయించుకున్నాయి. తనదుగుణంగా రెండు దేశాల శాస్త్రవేత్తల మధ్య ఈ ఏడాది ప్రారంభంలోనే చర్చలు జరిగినట్టు నాసా అడ్మినిస్ట్రేషన్​ స్టీవ్​ జుర్జెక్​ వెల్లడించారు. అయితే.. కక్ష్యలకు సంబంధించిన సమాచారమే తప్ప ఎలాంటి లోతైన సాంకేతిక విషయాలనూ తాము చైనాతో పంచుకోలేదని ఆయన అన్నారు.

ఇదీ చదవండి: అంగారకుడి గర్భంలో జలసిరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.