అంతరిక్షంలోకి వ్యోమగాములను తీసుకెళ్లే ప్రయోగాన్ని స్పేస్ ఎక్స్ విజయవంతంగా నిర్వహించింది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా నలుగురు వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి చేర్చనుంది స్పేస్ ఎక్స్. ఓ ప్రైవేటు సంస్థ నాసాకు పూర్తి స్థాయి వాహకనౌక ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. కాగా ఇది స్పేస్ ఎక్స్ చేపట్టిన రెండో మానవసహిత అంతరిక్ష ప్రయోగం.
-
Resilience rises. 🚀
— NASA (@NASA) November 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The Crew-1 mission has lifted off on a Falcon 9 rocket from @NASAKennedy at 7:27pm ET and is en route to the @Space_Station. #LaunchAmerica pic.twitter.com/5Q3uXSLvqt
">Resilience rises. 🚀
— NASA (@NASA) November 16, 2020
The Crew-1 mission has lifted off on a Falcon 9 rocket from @NASAKennedy at 7:27pm ET and is en route to the @Space_Station. #LaunchAmerica pic.twitter.com/5Q3uXSLvqtResilience rises. 🚀
— NASA (@NASA) November 16, 2020
The Crew-1 mission has lifted off on a Falcon 9 rocket from @NASAKennedy at 7:27pm ET and is en route to the @Space_Station. #LaunchAmerica pic.twitter.com/5Q3uXSLvqt
-
Crew Dragon has separated from Falcon 9’s second stage and is on its way to the @space_station for its first operational mission! Autonomous docking tomorrow at ~11:00 p.m. EST pic.twitter.com/GCeLEyTjZe
— SpaceX (@SpaceX) November 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Crew Dragon has separated from Falcon 9’s second stage and is on its way to the @space_station for its first operational mission! Autonomous docking tomorrow at ~11:00 p.m. EST pic.twitter.com/GCeLEyTjZe
— SpaceX (@SpaceX) November 16, 2020Crew Dragon has separated from Falcon 9’s second stage and is on its way to the @space_station for its first operational mission! Autonomous docking tomorrow at ~11:00 p.m. EST pic.twitter.com/GCeLEyTjZe
— SpaceX (@SpaceX) November 16, 2020
ప్రయోగానికి మస్క్ దూరం
కరోనా పరీక్షల్లో అయోమయం నెలకొన్న కారణంగా స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ ప్రయోగానికి దూరంగా ఉన్నారు. ఇదివరకు నిర్వహించిన నాలుగు కరోనా పరీక్షల్లో ఆయనకు రెండుసార్లు పాజిటివ్, రెండు సార్లు నెగెటివ్ వచ్చింది. ప్రామాణిక ప్రయోగ ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. నాసా నిబంధనల ప్రకారం కరోనా సోకినవారు క్వారంటైన్‌లోనే ఉండాలి. ఈ నేపథ్యంలో కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు ఆయన రాలేదు.
అంతరిక్షయానాల కోసం ప్రైవేట్ సంస్థ స్పేస్‌ఎక్స్‌తో నాసా ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం.. భవిష్యత్తు అంతరిక్షయానాలకు స్పేస్‌ఎక్స్ వ్యోమనౌకల్ని అందించాల్సి ఉంటుంది. అందులో భాగంగా నిర్మించిందే ఈ ‘క్రూ డ్రాగన్’. మేలో దీన్ని తొలిసారి ప్రయోగాత్మకంగా ప్రయోగించారు. ఇద్దరు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వెళ్లి రెండు నెలల తర్వాత క్షేమంగా తిరిగి వచ్చారు. ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్‌ఎక్స్ పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగాలకు నాసా అనుమతించింది. నేడు జరిగిన ప్రయోగం రోదసీయాన చరిత్రలో తొలి వాణిజ్య అంతరిక్షయానంగా చెప్పవచ్చు. ఒకరకంగా అంతరిక్షంలోకి ట్యాక్సీ సర్వీసులు ప్రారంభమైనట్లే. ఇకపై అమెరికాకు భారీగా బడ్జెట్ ఆదా కానుంది. 2011 తర్వాత అమెరికా తమ సొంత సొంత వ్యోమనౌకల్ని ఉపయోగించడం నిలిపివేసింది. అప్పటి నుంచి రష్యాకు చెందిన సోయుజ్‌లో తమ వ్యోమగాముల్ని ఐఎస్‌ఎస్‌కు పంపుతోంది. దీనికి భారీగా చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు తాజాగా ఫాల్కన్ రాకెట్‌లో ఉపయోగించిన తొలి దశ బూస్టర్‌ని మరోసారి వినియోగించేలా నిర్మించారు.
నాలుగు సార్లు స్పేస్‌వాక్..
ఈ ప్రయోగంతో అంతరిక్షయాన చరిత్రలో ఓ కొత్తం శకం ప్రారంభమైందని నాసా తెలిపింది. ఇక నుంచి భూదిగువ కక్ష్యలోకి తరచూ జరిగే అంతరిక్షయానాలకు ఓ ప్రైవేటు సంస్థ సేవలనందించనుందని పేర్కొంది.
తాజాగా వెళ్లిన వ్యోమగాములు మొత్తం నాలుగు సార్లు స్పేస్‌వాక్ చేయాల్సి ఉంది. యూకేకు చెందిన ఎండీయే రూపొందించిన ‘కోకా కమ్యూనికేషన్స్ టెర్మినల్’ను ఐఎస్‌ఎస్‌లోని ఐరోపా స్పేస్ మాడ్యూల్ కొలంబస్‌కు బిగించనున్నారు. దీని ద్వారా అక్కడ ఉన్న వ్యోమగాములు భూమిపై ఉండే బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌తో ఇక్కడి శాస్త్రవేత్తలు, కుటుంబ సభ్యులతో ముచ్చటించవచ్చు.
తాజా ప్రయోగాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆయన సతీమణితో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. అధ్యక్షుడు ట్రంప్ నాసా, స్పేస్‌ఎక్స్ కృషిని అభినందించారు. కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ.. ''ప్రయోగం శాస్త్రవిజ్ఞానానికి ఉన్న శక్తికి నిదర్శనం. అలాగే, మన వినూత్నత, చతురత, సంకల్పం ద్వారా ఏదైనా సాధించగలం అనడానికి ఉదాహరణ'' అని వ్యాఖ్యానించారు.
ఎవరెవరు వెళ్లారంటే!
అంతరిక్ష నౌకలో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములతో పాటు జపాన్‌కు చెందిన ఓ వ్యోమగామి ఉన్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు వీరంతా అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. ఐదారు నెలలు అక్కడే ఉండి పలు పరిశోధనలు నిర్వహిస్తారు.
క్రూ కమాండర్ మైక్ హాప్కిన్స్(51): మిస్సోరీ రాష్ట్రానికి చెందిన మైక్ హాప్కిన్స్ ఎయిర్‌ఫోర్స్‌లో కర్నల్ స్థాయి అధికారి. అంతరిక్ష కేంద్రంలో ఇదివరకు గడిపిన అనుభవం ఆయనకు ఉంది. పశువులను కాసే కుటుంబ నేపథ్యంలో పెరిగారు. 2009లో వ్యోమగామిగా మారే ముందు యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినోయిస్ తరపున ఫుట్‌బాల్ ఆడారు. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం-పెంటగాన్‌లో పనిచేశారు.
షనన్ వాకర్(55): హ్యూస్టన్‌లో పుట్టిన షనన్ ఓ భౌతిక శాస్త్రవేత్త. ఇదివరకు స్పేస్ స్టేషన్లో గడిపారు. నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో ఫ్లైట్ కంట్రోలర్‌గా పనిచేశారు. పలు అంతరిక్ష కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2004లో వ్యోమగామిగా మారారు. శుక్ర గ్రహంపై వాతావరణ పరిస్థితుల గురించి రైస్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ చేశారు. ఆమె భర్త ఆండ్రూ థామస్ విశ్రాంత వ్యోమగామి.
సియోచీ నొగుచి(55): జపనీస్ స్పేస్ ఏజెన్సీకి చెందిన నొగుచి.. ఇదివరకే అంతరిక్షంలోకి వెళ్లివచ్చారు. మూడు రకాల స్పేస్ క్రాఫ్ట్‌లలో ప్రయాణించిన మూడో వ్యక్తిగా రికార్డుకెక్కారు. అమెరికా స్పేస్ షటిల్, రష్యన్ సోయుజ్ వ్యోమనౌకలలో ఇదివరకు ప్రయాణించారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో నుంచి మూడు డిగ్రీలు చేశారు. ఇంజినీర్‌గా, గూఢచారిగా పనిచేశారు. 1996లో వ్యోమగామిగా మారారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నకూతురు తండ్రిదారిలోనే ఈ రంగాన్ని ఎంచుకున్నారు.
నేవీ కమాండర్ విక్టర్ గ్లోవర్(44): లాస్ ఎంజిలిస్కు చెందిన గ్లోవర్ ఓ పైలట్. అంతరిక్షయాన అనుభవం లేదు. సుదీర్ఘ కాలం అంతరిక్షంలో ఉండేందుకు వెళ్లిన తొలి ఆఫ్రో అమెరికన్ ఈయనే. కాలిఫోర్నియా పాలిటెక్నిక్ స్టేట్ యూనివర్సిటీ తరపున ఫుట్‌బాల్ ఆడారు. రెజ్లింగ్ పోటీల్లో సైతం పాల్గొన్నారు. వ్యోమగామిగా 2013లో ఆయన్ను నాసా ఎంపిక చేసింది. అంతకుముందు సెనెటర్ జాన్ మెక్కెయిన్ వద్ద లెజిస్లేటివ్ ఫెలోగా పనిచేశారు.