ETV Bharat / international

అమెరికాలో కరోనాకు 40 మంది ప్రవాసులు బలి - Indian-Americans

అమెరికాలోని భారతీయ పౌరులు/భారత సంతతి వ్యక్తులు సుమారు 40 మందికిపైగా కరోనా ధాటికి బలయ్యారు. మరో 1,500 మంది కొవిడ్​తో పోరాడుతున్నారు.

More than 40 Indian-Americans, Indian nationals die of COVID-19 in US
కరోనాకు 40 మంది 'భారత సంతతి' వ్యక్తులు బలి
author img

By

Published : Apr 11, 2020, 1:44 PM IST

కరోనా మహమ్మారి ధాటికి అమెరికాలోని 40 మందికిపైగా భారత సంతతి వ్యక్తులు/భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,500 మందికిపైగా కొవిడ్​-19 బారినపడ్డారని అక్కడి భారతీయ సంఘాలు వెల్లడించాయి.

అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో ఎక్కువగా శాతం న్యూయార్క్​, పక్కనే ఉన్న న్యూజెర్సీల్లో నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనే భారతీయ-అమెరికన్లు ఎక్కువగా నివసిస్తున్నారు. ఇక్కడ వరుసగా 1000, 400మందికిపైగా బాధితులుండగా.. అధికంగా ట్యాక్సీ డ్రైవర్లేనని సమాచారం.

న్యూయార్క్​లోనే 15 మంది భారతీయ-అమెరికన్లు మరణించినట్లు అక్కడి భారతీయ సంఘాల నేతలు వెల్లడించారు. ఫ్లోరిడా, పెన్సిల్వేనియాలో ఇద్దరు, టెక్సాస్​, కాలిఫోర్నియాలో ఒకరు చొప్పున కొవిడ్​ కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. మృతుల్లో 12 మంది భారతీయ పౌరులున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

More than 40 Indian-Americans, Indian nationals die of COVID-19 in US
కరోనాకు 40 మంది 'భారత సంతతి' వ్యక్తులు బలి

కరోనా వల్ల మరణించిన వారంతా 60 ఏళ్లు పైబడిన వారే. ఒకరు మాత్రం 21 ఏళ్ల వ్యక్తి అని సమాచారం.

మృతుల వివరాలు

⦁ కరోనాతో పోరాడుతూ మరణించిన వారిలో సున్నోవా ఎనలిటికల్ ఇంక్ సీఈఓ హనుమంతరావు మారేపల్లి ఒకరు. న్యూజెర్సీలో ఉంటున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

⦁ న్యూజెర్సీలోని మరో ప్రముఖ వ్యాపారి చంద్రకాంత్ అమిన్​ కూడా కరోనాతో మరణించారు.

⦁ అరవై ఏళ్ల మహేంద్ర పటేల్​ కరోనాతో పోరాడుతూ మరణించారు. అయితే అంత్యక్రియలకు 9 మందికి మించి హజరుకాకూడదని అధికారులు సూచించిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆన్​లైన్​లోనే ఆయనకు వీడ్కోలు పలికారు.

ప్లాస్మా... ప్లీజ్​

కరోనాతో పోరాడుతున్న వారిని ఆదుకోవడం కోసం ప్రవాస భారతీయలు ఆన్​లైన్, సోషల్​ మీడియాల్లో ప్రచారం మొదలుపెట్టారు. దాతల నుంచి 'ప్లాస్మా' సేకరించడానికి కృషి చేస్తున్నారు. కొంత మంది ఉచితంగా ఆహార పదార్థాలను, మాస్కులు, చేతి తొడుగులను అందిస్తున్నారు.

ఉగ్రరూపం..

అమెరికాలో శుక్రవారం రికార్డు స్థాయిలో 2,108 కరోనా మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటిందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కరోనాతో న్యూయార్క్​ చెలగాటం- తప్పని భారీ మూల్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.