ETV Bharat / international

టీకా విషయంలో మరో శుభవార్త చెప్పిన మోడెర్నా - వ్యాక్సిన్‌

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో తమ టీకాకు 95శాతం సమర్థత ఉన్నట్లు ప్రకటించిన మోడెర్నా సంస్థ మరో శుభవార్త చెప్పింది. రిఫ్రిజిరేటర్లలో తమ టీకాను 30రోజుల పాటు నిల్వ ఉంచడం సాధ్యమేనని చెబుతోంది. ఒకవేళ ఇదే సాధ్యమైతే టీకా పంపిణీకి కోల్డ్‌ స్టోరేజీ సమస్యను అధిగమించినట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు.

Moderna Vaccine Offers antidote for deep freeze
టీకా విషయంలో మరో శుభవార్త చెప్పిన మోడెర్నా
author img

By

Published : Nov 17, 2020, 7:25 PM IST

తమ టీకా విషయంలో మరో ఊరటనిచ్చే విషయం పంచుకుంది మోడెర్నా సంస్థ. తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ భద్రపరిచేందుకు సాధారణ రిఫ్రిజిరేటర్లు (2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత) సరిపోతాయని చెబుతోంది. ఈ విధానంలో 30రోజుల పాటు నిల్వ ఉంచడం సాధ్యమేనని అంటోంది. వైరస్‌ను ఎదుర్కోవడంలో తమ టీకాకు 95శాతం సమర్థత ఉన్నట్లు ఇటీవలే ప్రకటించింది ఈ సంస్థ.

దీనితో లాభం ఏంటి?

వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడం ఎంత కీలకమో, ఆ టీకాను భద్రపరిచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడం కూడా అంతే ముఖ్యం. ఈ నేపథ్యంలో ఫైజర్‌ అభివృద్ధి చేసిన టీకా మైనస్‌ 70డిగ్రీల సెల్సియస్‌ అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సి రావడం అతిపెద్ద సవాల్‌గా మారింది. అంతేకాకుండా సాధారణ రిఫ్రిజిరేటర్లలో కేవలం ఐదురోజులు మాత్రమే నిల్వచేయవచ్చని తెలపడంతో వ్యాక్సిన్‌ పంపిణీ తీవ్ర చర్చనీయాంశమైంది. అతి కనిష్ఠ ఉష్ణోగ్రతలతో టీకాను మారుమూల ప్రాంతాలకు తరలించడం అతిపెద్ద సవాల్‌ అనే భావన అటు నిపుణులు, అధికారుల్లో వ్యక్తమైంది. ఇందుకోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందనే ఆందోళన మొదలయ్యింది. మోడెర్నా సంస్థ టీకాను రిఫ్రిజిరేటర్​లోనే నిల్వ చేయడం సాధ్యమైతే కోల్డ్‌ స్టోరేజీ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు.

పేద దేశాలకు ఊరటనిచ్చేలా..

అయితే, మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్‌కు ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవని ప్రకటించింది. కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్లతోనే దాదాపు నెలరోజుల పాటు టీకాను నిల్వ ఉంచుకోవచ్చని పేర్కొంది. అయితే, టీకా సరఫరాపై మోడెర్నా ఇప్పటివరకు అభివృద్ధి చెందిన దేశాలతోనే ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా రిఫ్రిజిరేటర్లలోనే టీకా నిల్వ చేయవచ్చని వస్తోన్న వార్తలతో అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు పేద దేశాలకు ఊరట కలుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో, ఫైజర్‌ కూడా టీకా నిల్వ సమస్యను పరిష్కరించే మార్గం కోసం అన్వేషిస్తోంది.

మోడెర్నాతో భారత్‌ సంప్రదింపులు?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలపై సానుకూల ఫలితాలు వస్తుండడంతో భారత్‌ కూడా అప్రమత్తమైనట్లు సమాచారం. దాదాపు 95శాతం సమర్థత కలిగినట్లు వెల్లడించిన మోడెర్నాతో సంప్రదింపులు జరుపుతుందనే వార్తలు వస్తున్నాయి. అయితే, మోడెర్నాతోపాటు ఫైజర్‌, సీరం ఇనిస్టిట్యూట్‌ (ఆస్ట్రాజెనెకా టీకా ప్రయోగాలు చేస్తోంది), భారత్‌ బయోటెక్‌, జైడస్‌ క్యాడిలా వంటి సంస్థల టీకా‌ల ప్రయోగాలు, వాటి భద్రత, నిరోధకత, నియంత్రణ సంస్థల అనుమతులపై ఆయా కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.

ఆ మినహాయింపునకు అవకాశం!

మన దేశంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పరిశోధనలు జరిపి అక్కడి నియంత్రణ సంస్థల అనుమతులు పొందే ఏదైనా టీకా లేదా ఔషధం డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్స్‌ చట్టం(సీడీఎస్‌సీఓ) ప్రకారం రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను భారత్‌లో చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే ఇక్కడి నియంత్రణ సంస్థల అనుమతి పొందుతాయి. అయితే, ప్రస్తుతం ఏర్పడ్డ అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్రక్రియకు మినహాయింపు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:కరోనా టీకా సామర్థ్యం ఎలా ఉందంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.