వేసవి సెలవుల తర్వాత కరోనా వేళ.. తిరిగి పాఠశాలలో తరగతులకు హాజరు అయ్యేందుకు అమెరికాలోని లక్షలాది మంది విద్యార్థులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆ దేశ విద్యావిభాగం చేసిన సర్వేలో తేలింది.
అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తమైనట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాలలు తెరవడంపై కాలిఫోర్నియా గవర్నర్.. కఠినమైన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేశారు. పాఠశాల ఆవరణలో రెండోతరగతికి మించి తరగతుల విద్యార్థులు, పాఠశాల సిబ్బంది మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు.
టెక్సాస్‌లో తొలి 8 వారాల పాటు ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించాలని నిబంధనలు పెట్టారు. అక్కడ దాదాపు 50 లక్షల మంది పాఠశాల విద్యార్థులుండగా.. ప్రస్తుతానికి బడులన్నీ మూసివేసే ఉంచాలని యంత్రాంగం స్పష్టం చేసింది. ఇంకొన్ని నగరాల్లో దాదాపు నవంబర్ వరకు మూసే ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
చికాగో విద్యార్థులు వారంలో రెండు రోజుల పాటు పాఠశాలలో తరగతులకు హాజరయ్యేలా చూడాలనుకుంటుండగా.. పూర్తి నిర్ణయం ఆగస్టు చివరకు వెలువడనుంది. ఇంకా.... అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది.
ఇదీ చదవండి: బ్రిటన్‌లో మరో జార్జ్ ఫ్లాయిడ్.. మెడపై మోకాలు పెట్టి!