ETV Bharat / international

'మిషిగన్​లో బైడెన్​ గెలుపునే ఖరారు చేసేయండి' - అమెరికా అధ్యక్ష ఎన్నికలు

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు అనుకూలంగా మిషిగన్ ఎన్నికల ఏజెన్సీ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే వారంలో ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించాలని రాష్ట్రంలో ఎన్నికల పరిశీలకులకు సిఫార్సు చేసింది. ఇప్పటికే వెల్లడైన ఫలితాలనే ఖరారు చేయాలని స్పష్టం చేసింది.

US-MICHIGAN-BIDEN
బైడెన్​
author img

By

Published : Nov 21, 2020, 9:58 PM IST

అమెరికాలో నవంబర్​ 3న జరిగిన ఎన్నికల ఫలితాలను వచ్చే వారం ధ్రువీకరించాలని రాష్ట్ర పరిశీలకులకు మిషిగన్ ఎన్నికల ఏజెన్సీ సిఫార్సు చేసింది. ఇప్పటికే వెల్లడైన ఫలితాలను ఖరారు చేయాలని తెలిపింది. ఈ నిర్ణయం అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​కు లాభించనుంది.

మిషిగన్​ రాష్ట్ర చట్ట సభ్యులను శ్వేతసౌధానికి పిలిచి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో తాజా సూచనలు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని 83 కౌంటీల్లో ధ్రువీకరించిన ఫలితాలను పంపినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: 'ట్రంప్ వద్దన్నా బైడెన్​కే ఆ ఖాతాను అప్పగిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.