ETV Bharat / international

15వ కాన్పులో ఆడపిల్ల- నెరవేరిన 30ఏళ్ల కల - మిషిగన్​ దంపతులకు తొలి ఆడబిడ్డ

ఆడపిల్ల పుట్టిందని కొందరు కర్కశత్వం చూపిస్తున్న ఈ కాలంలో ఓ దంపతులు మాత్రం అమ్మాయి పుట్టాలని 30 ఏళ్లు ఎదురుచూశారు. అయితే దాదాపు 14 మంది మగపిల్లల తర్వాత 15వ సంతానంగా ఆడశిశువు జన్మించడం వల్ల వారి ఆనందానికి అవధుల్లేవు. ఈ ఘటన అమెరికాలోని మిషిగన్​లో జరిగింది.

girl child
15వ కాన్పులో ఆడపిల్ల- నెరవేరిన 30ఏళ్ల కల
author img

By

Published : Nov 7, 2020, 5:22 PM IST

Updated : Nov 7, 2020, 7:15 PM IST

అమెరికా మిషిగన్​కు చెందిన ఓ జంట ఆడబిడ్డ కోసం సంవత్సరాల పాటు ఎదురుచూశారు. దాదాపు 30 ఏళ్లకు వారి కల నెరవేరింది. తాజాగా ఆ చిన్నారి రాకతో ఆ కుటుంబసభ్యులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ దంపతులకు 14 మంది అబ్బాయిలు ఉండటం విశేషం.

45 ఏళ్ల వయస్సులో...

45ఏళ్ల జే ష్వాండ్ట్స్​ - కటెరి దంపతులకు గురువారం పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆమెకు మ్యాగీ జేన్​ అని పేరు పెట్టారు. కుటుంబంలోకి మ్యాగీని ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు జే.

"ఈ ఏడాది మాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. వాటన్నింటిలో మ్యాగీయే మాకు లభించిన అతిపెద్ద బహుమతి."

-- జే ​ష్వాండ్ట్స్​​, మిషిగన్ ​వాసి.

14మంది సంతానంతో ఇప్పటికే జే-కటెరి​ జంట అనేకమార్లు వార్తల్లో నిలిచారు. డేటింగ్​లో ఉండి ముగ్గురు పిల్లలు కన్న తర్వాత 1993లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. జే న్యాయవాదిగా ఉంటూనే భూ వ్యాపారాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:- కరోనాపై పోరుకు బైడెన్-హారిస్​ కసరత్తులు

Last Updated : Nov 7, 2020, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.