అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ విజయాన్ని మిషిగన్ ధ్రువీకరించింది. రాష్ట్రంలో 1.54 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు స్పష్టం చేసింది. ఫలితంగా ఇక్కడి ఓట్ల లెక్కింపుపై సవాలు చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురైంది.
మిషిగన్ రాష్ట్ర కాన్వాసర్ల బోర్డు 3-0 ఓట్లతో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించింది. మిషిగన్ చట్టం ప్రకారం 2.8 పర్సెంటేజ్ పాయింట్లతో గెలుపొందిన బైడెన్‌కు 16 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి.
ఇదీ చూడండి: 'మిషిగన్‌లో బైడెన్ గెలుపునే ఖరారు చేసేయండి'