ETV Bharat / international

బైడెన్​ గెలిస్తే అమెరికాను వదిలి వెళ్తానేమో: ట్రంప్​ - అమెరికా ఎన్నికలు 2020

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు, ప్రత్యర్థి బైడెన్​ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్​. తాను ఒకవేళ ఓడిపోతే.. అమెరికాను వదిలి వెళ్లొచ్చని మరోసారి వ్యాఖ్యానించారు. దీనిపై, జో బైడెన్​ వినూత్నంగా స్పందించారు.

Maybe I'll have to leave the country if Biden wins: Trump
బైడెన్​ గెలిస్తే నేను.. అమెరికాను వదిలి వెళ్తానేమో!: ట్రంప్​
author img

By

Published : Oct 17, 2020, 2:41 PM IST

నవంబర్​ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచార పర్వాన్ని ఉద్ధృతం చేశారు ట్రంప్​. బైడెన్​ చేతిలో తాను ఓడిపోతే.. అమెరికాను వదిలేసి వెళ్తానని చమత్కరించారు. జార్జియా, మకోన్​లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

" నేను మీతో సరదాకి చెప్పడం లేదు. అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఒక అసమర్థ అభ్యర్థితో పోటీ పడుతుండడం.. నాకు ఒత్తిడి కలిగిస్తోంది. నేను ఒక వేళ ఓడిపోతే ఏం చేస్తానో మీరు ఊహించగలరా..? బహుశా నేను అమెరికాను విడిచి వెళ్తానేమో! నాకూ తెలియదు. "

-- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

'నేను ఆమోదిస్తున్నాను..'

ట్రంప్​ వ్యాఖ్యలపై తనదైన రీతిలో ట్విట్టర్​ వేదికగా సమాధానమిచ్చారు డెమొక్రటిక్​ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​. 'నేను జో బైడెన్​. నేను దీనికి ఆమోదిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.

గతంలోనూ..
ట్రంప్​ గత నెలలో నార్త్ కరోలినాలో ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలనే తాజాగా మళ్లీ చేశారు. 'నేను బైడెన్​ చేతిలో ఓడిపోతే.. నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను మీతో మళ్లీ మాట్లాడను' అని అప్పుడు ఆయన అన్నారు.

2016 ఎన్నికల ప్రచారంలోనూ ట్రంప్​ ఇలాగే అన్నారు ట్రంప్​. తాను రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఓటమి పాలైతే ప్రజలకు కనిపించకుండా ఉంటానని చెప్పారు.

ఇదీ చూడండి: రంగంలోకి ఒబామా- జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.