Masud Khan Pak Envoy To America: అమెరికాలో పాక్ రాయబారిగా మసూద్ ఖాన్ నియామకాన్ని తిరస్కరించాలని భారతీయ అమెరికన్ల ఉన్నత స్థాయి బృందం అధ్యక్షుడు జో బైడెన్‌కు విజ్ఞప్తి చేసింది. మసూద్ ఖాన్ ఉగ్రవాద గ్రూపుల సానుభూతిపరుడిగా పేర్కొంది.
పాక్ దౌత్యవేత్త మసూద్ ఖాన్ ఉగ్రవాద గ్రూపులకు సానుభూతిపరుడని, మద్దతుదారుడని భారత ఉన్నతస్థాయి బృందం ఆరోపించింది.
"మసూద్‌ఖాన్ నియామకాన్ని తిరస్కరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, విదేశీ వ్యవహారాల హౌస్ కమిటీ, సెనెట్ సభ్యులను కోరాం."
-- భారతీయ అమెరికన్ల ఉన్నతస్థాయి బృందం
లేడీ అల్‌ఖైదా అఫియా సిద్ధిఖీ, ఉగ్రవాద గ్రూపులు హిజ్బుల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, జమాతే ఇస్లామీ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించినట్లు భారత ఉన్నతస్థాయి బృందం ఆందోళన వ్యక్తం చేసింది.
మసూద్ ఖాన్‌ను దైత్యవేత్తగా నియమించడం వల్ల టెర్రరిస్టు సంస్థలు అమెరికాలోని ఇన్స్టిట్యూట్లలోకి ప్రవేశం పొందే ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడింది. అఫ్గానిస్థాన్‌పై అమెరికాకు ఉన్న వైఖరి పైనా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది.
2019లో మసూద్ ఖాన్ అంతర్జాతీయ ఉగ్రవాది, హర్కత్-ఉల్- ముజాయిద్దీన్(హెచ్‌యూఎం)వ్యవస్థాపకుడు ఫజలూర్ రెహ్మాన్ ఖలీల్‌తో స్టేజీ పంచుకున్నాడని ఆరోపించింది.
ఆగస్టు 21, 2015 వరకు మసూద్‌ఖాన్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) అధ్యక్షుడిగా ఉన్నాడని పేర్కొంది భారత ఉన్నతస్థాయి బృందం.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'గల్వాన్' ఘర్షణలో చైనా సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ!