ETV Bharat / international

'కరోనా వ్యాక్సిన్‌ వచ్చినా మాస్కులు తప్పనిసరి'

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్​-19కు వ్యాక్సిన్​ వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో అంతగా మార్పులు ఉండవని అమెరికా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కరోనాకు టీకా వచ్చాక కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనల్ని పాటించాల్సిందేనన్ని పేర్కొన్నారు.

author img

By

Published : Aug 1, 2020, 10:56 PM IST

Mask and social distancing will be crucial even after Covid-19 vaccine: Scientists
వ్యాక్సిన్‌ వచ్చినా మాస్కులు తప్పనిసరి

కరోనా నివారణకు వ్యాక్సిన్‌ వచ్చినా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాల్సిందేనని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బేలర్ మెడికల్‌ కాలేజ్‌లో నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అసోసియేట్ డీన్‌గా పనిచేస్తున్న మరియా ఎలెనా బొటాజ్జి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. వ్యాక్సిన్‌ కరోనాను తగ్గిస్తుందేమో కానీ పూర్తిగా తొలగించలేదని ఆమె స్పష్టం చేశారు.

'వాక్సిన్‌ తీసుకున్నాక గతేడాది ఎలా ఉన్నామో అలాగే ఉందాం అని ప్రజలు అనుకోవచ్చు. కానీ అది తప్పు. మొదట టీకా అద్భుతాలు సృష్టించకపోవచ్చు. ఒక్కసారిగా పరిస్థితిని నయం చేయలేదు. కొవిడ్‌ను పూర్తిగా తొలగించకపోవచ్చు. మాస్కులు దరిస్తూ, భౌతిక దూరం పాటించాల్సిందే.'

- మరియా ఎలెనా బొటాజ్జి

150 రకాల వ్యాక్సిన్​ల అభివృద్ధి..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది. అందులో 26 టీకాలకు మానవులపై ప్రయోగించేందుకు అనుమతి లభించింది. వీటిలో 5 వ్యాక్సిన్​లు.. మూడో (చివరి) దశ క్లినికల్‌ పరీక్షల్లో ఉన్నాయి. అయితే చివరి దశలో వేలాది మంది వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో టీకా భద్రత, సామర్థ్యాన్ని పరీక్షించనున్నారు. కరోనా అత్యవసర సమయంలో వినియోగించేందుకు మోడెర్నా, ఫిజర్, ఆస్ట్రాజెనెకా లాంటి కంపెనీలు వైరస్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో మానవులపై రెండు రకాల వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నారు.

ఇదీ చదవండి: మాస్క్​ను ఇలా ధరిస్తేనే కరోనా నుంచి రక్ష!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.