ETV Bharat / international

ప్రాణాలు నిలుపుకునేందుకు కాలు నరుక్కున్న రైతు

మొక్కజొన్నలు ఆడే యంత్రంలో కాలు ఇరుక్కుపోయింది. మెషీన్​ వేగంగా తిరుగుతోంది. శరీరం మొత్తాన్ని లాగేస్తోంది. సాయం చేసేందుకు దగ్గర్లో ఎవరూ లేరు. కనీసం జేబులో ఫోన్​ అయినా లేదు. విధిలేక తన కాలును తానే నరుక్కున్నాడో రైతు.

author img

By

Published : May 16, 2019, 8:09 PM IST

ప్రాణాలు నిలుపుకునేందుకు కాలు నరుక్కున్న రైతు
ప్రాణాలు నిలుపుకునేందుకు కాలు నరుక్కున్న రైతు

కర్ట్​ కేసర్​... 63ఏళ్ల రైతు. ఉండేది అమెరికా నెబ్రాస్కాలోని పెండర్​లో. ఇటీవలే మృత్యువుకు దగ్గరకు వెళ్లి వచ్చారు ఈయన. ఆఖరి క్షణంలో ప్రాణాలు కాపాడుకునేందుకు తన కాలును తానే నరికేసుకున్నారు.

కొద్దిరోజుల క్రితం పొలంలో ఒంటరిగా పనిచేసుకుంటున్నారు కేసర్​. మొక్కజొన్నలను ట్రక్కు నుంచి దింపుతున్నారు. ఆయన కాలు పొరపాటున మొక్కజొన్నలు ఆడే యంత్రంలో ఇరుక్కుపోయింది.

"డబ్బాలోకి మొక్కజొన్న అన్​లోడ్​ చేస్తున్నా. ఒకచోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్తున్నా. అనుకోకుండా నేను హాపర్​పై ఉన్న చిన్న రంధ్రంపై అడుగు పెట్టాను. వెంటనే అది నా కాలును లాగేసుకుంది. నేను వెనక్కు తీసేందుకు ప్రయత్నిస్తున్నా. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే అది నన్ను కుదిపేస్తోంది. అప్పుడు నాకు అనిపించింది. నన్నది పూర్తిగా లాగేస్తుందని. ఆ సమయంలో నా జేబులో కత్తి ఉంది. ఇక దానితో కాలు నరికేయటం ఒక్కటే మార్గం అనిపించింది. వెంటనే కోసేయటం మొదలుపెట్టా. నరాలు పటపటమని తెగిపోయినట్లు అనిపించింది. నేను అలానే కాలు కోసేసి ప్రమాదం నుంచి బయటపడ్డా."
-కర్ట్ కేసర్, నెబ్రాస్కా రైతు

ఫోన్​ కూడా లేదు...

ప్రమాదం జరిగిన సమయంలో కేసర్ జేబులో ఫోన్​ కూడా లేదు. కాలు నరుక్కున్న అనంతరం 150మీటర్ల దూరంలోని తన ఇంటికి పాకుకుంటూ వెళ్లారు. అత్యవసర సిబ్బందికి ఫోన్​ చేశారు.
అత్యవసర సేవల విభాగంలో కర్ట్​ కుమారుడు పనిచేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే సహాయక బృందంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసర్​ను ఆస్పత్రిలో చేర్చారు. వారం రోజుల చికిత్స తర్వాత ఇటీవలే డిశ్చార్జ్​ అయ్యారు కేసర్.

సినిమా కథ...

హాలీవుడ్​ సినిమా '127 అవర్స్​'ది ఇలాంటి కథే. రెండు కొండల మధ్య ఇరుక్కుపోతాడు హీరో. ఇలా 5 రోజులు ప్రత్యక్ష నరకం అనుభవిస్తాడు. చివరకు తన చేతిని తానే కోసుకుని బయటపడతాడు.
'127 అవర్స్​' సినిమాకు, కేసర్​ కథకు ముడిపెడుతూ కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

Intro:Body:

ljkkkjkj

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.