ETV Bharat / international

డిస్నీ ఐలాండ్​లో క్వారంటైన్​కు యత్నం- చివరకు... - డిస్నీ ద్వీపం

డిస్నీ ఐలాండ్​లో తన క్వారంటైన్​ సమయాన్ని గడుపుదామనుకున్న ఓ వ్యక్తిని ఫ్లోరిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అది నిషిద్ధ ప్రదేశమన్న విషయం తనకు తెలియదని అతడు బుకాయించాడు. ప్రజలకు అనుమతులు లేవని చెప్పడానికి ఎన్నో బోర్డులు ఉన్నా.. ఆ వ్యక్తి లోపలికి ప్రవేశించాడని డిస్నీ భద్రతా సిబ్బంది అరోపించారు. వెంటనే అతడిపై కేసు నమోదు చేయాలని కోరింది.

Man arrested trying to quarantine on private Disney island
డిస్నీ ఐలాండ్​లో క్వారంటైన్​కు యత్నం​.. చివరికి!
author img

By

Published : May 3, 2020, 2:24 PM IST

అమెరికాలోని డిస్నీ ఐలాండ్​లో ఓ వ్యక్తి తన క్వారంటైన్​ సమయాన్ని చాలా ఆహ్లాదంగా గడపాలనుకున్నాడు. రిచర్డ్​ మెక్​గ్వైర్​ అనే వ్యక్తి గత సోమవారం నుంచి అక్కడే ఉన్నాడు. వారం రోజులపాటు క్యాంప్​ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకోవడం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు ఆరెంజ్​ కౌంటీ అధికారులు గురువారం 42 ఏళ్ల రిచర్డ్​ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే తనకు పోలీసుల హెచ్చరికలు వినపడలేదని రిచర్డ్​ తెలిపాడు. ప్రైవేటు ద్వీపాన్ని ఓ స్వర్గంగా అభివర్ణించిన రిచర్డ్​.. అది నిషిద్ధ ప్రాంతామన్న విషయం తనకు తెలియదన్నాడు.

ఈ విషయంపై డిస్నీ భద్రతా విభాగం ప్రతినిధి స్పందించారు. రిచర్డ్​ కంపెనీ బోటును వాడటం తాను చూసినట్టు తెలిపారు. డిస్నీ గేట్లు మూతపడ్డాయని, అక్రమంగా చొరబడకూడదని తెలిపేందుకు ఎన్నో బోర్డులు ఉన్నా.. రిచర్డ్​ లోపలకు ప్రవేశించాడని వివరించారు. అతడిపై కేసు నమోదు చేయాలన్నారు.

1999 నుంచి ప్రజలకు డిస్నీ ఐలాండ్​లోకి అనుమతి లేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.