ETV Bharat / international

వైరస్‌ను గుర్తించే స్మార్ట్‌ మాస్క్‌! - వైరస్‌ను గుర్తించే స్మార్ట్‌ మాస్క్‌!

కరోనా ఆనవాళ్లను మరింత సులభంగా గుర్తించే పరికరాన్ని రూపొందించారు కాలిఫోర్నియా యూనివర్సిటీ  పరిశోధకులు. మాస్క్​ను అట్టిపెట్టుకునే ఈ సాధనం.. ముక్కు, నోరు వద్దే కరోనాను గుర్తిస్తుంది. పీల్చే గాలిలో వైరస్​ ఆనవాళ్లు ఉంటే.. పరికరానికి అమర్చిన పలుచటి చార రంగు మారుతుంది. తద్వారా కొవిడ్​ను సులభంగా పసిగట్టడం సహా తదుపరి పరీక్షలు చేయించుకునేందుకు వీలుంటుంది.

Making masks smarter and safer against Covid-19
వైరస్‌ను గుర్తించే స్మార్ట్‌ మాస్క్‌!
author img

By

Published : Jan 23, 2021, 5:24 AM IST

కరోనా మహమ్మారిని పర్యవేక్షించే సాధనం ఇక నుంచి ముక్కు వద్దే ఉండనుంది. కరోనా వైరస్‌ను ముక్కు, నోరు వద్దే గుర్తించే స్మార్ట్‌ సాధనాన్ని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాండియాగో శాస్త్రవేత్తలు రూపొందించారు. కొవిడ్​-19ను తేలికగా గుర్తించగలిగే వీలున్న ఈ స్మార్ట్‌ పరికరం తయారీకి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌(ఎన్‌ఐహెచ్‌) 13లక్షల డాలర్ల నిధిని సమకూర్చింది.

రంగు మారితే వైరస్​ ఉన్నట్టు!

సాధారణంగా వినియోగించే మాస్కులపై(ఎన్​95, సర్జికల్‌) అతికించే విధంగా ఉండే స్టిక్కర్లను పరిశోధనా బృందం తయారుచేస్తోంది. మాస్క్‌ ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు వచ్చే కణాలను ఈ స్టిక్కర్‌తో పాటు ఉండే పలుచటి చార గ్రహిస్తుంది. ఒకవేళ కరోనా ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన వైరస్‌ వాటిలో ఉన్నట్లయితే పలుచటి చార రంగు మారుతుంది. తద్వారా కొవిడ్‌ వైరస్‌ను తేలికగా గుర్తించి, తదుపరి పరీక్షలు చేయించుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్‌ మాదిరిగానే తేలికగా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రజలందరికీ అలవాటైన మాస్కుల్లో ఇలాంటి సాంకేతికతను వినియోగించడం వల్ల.. సాధ్యమైనంత తొందరగా వివిధ రకాల వైరస్‌లను గుర్తించవచ్చని యూసీ శాండియాగో జాకబ్స్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌కు చెందిన ప్రొఫెసర్‌ జెస్సీ జోకెర్ట్స్‌ వెల్లడించారు. ప్రస్తుత కాలంలో కచ్చితంగా ధరించగలిగే వీలున్న మాస్కులు ఎన్నో విధాలుగా దోహదపడుతున్నాయని.. ఇందులో భాగంగానే కరోనా వైరస్‌ను పసిగట్టే తేలికైన సాధనాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు.

తక్కువ ఖర్చుతో..

కరోనాకు కారణమైన సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను తేలికగా గుర్తించే విధానం కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. అతితక్కువ ఖర్చులో, కచ్చితంగా వైరస్‌ను తేలికగా గుర్తించగలిగే పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్‌ఐహెచ్‌ ప్రయత్నిస్తోంది. వీటి ద్వారా రోజూ కొవిడ్‌ నిర్ధరణ చేసుకునే వీలుండనుంది. ఇలాంటి సాధనం కరోనా ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని పరిశోధకులు అన్నారు. భవిష్యత్‌లో కొత్తగా విజృంభించే ఏదైనా మహమ్మారులను ముందుగానే గుర్తించడంలోనూ ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టీకా జాక్​పాట్- లక్కీగా వరించిన వ్యాక్సిన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.