పెరూలో భారీ భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై తీవ్రత 8.0గా నమోదయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది.
ఆగ్నేయ ప్రాంతంలోని లాగునాస్కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో... తెల్లవారు 2.41గంటల ప్రాంతంలో సుమారు 114 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు తెలిపింది. ఈ ప్రాంతం తూర్పు ఈశాన్య దిశలోని అతిపెద్ద నగరం యురిమగువాస్కు 158 కిలోమీటర్ల దూరంలో ఉంది.
రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత నమోదైనట్లు పెరూ ప్రభుత్వం ట్వీట్ చేసింది. కలావో, రాజధాని లిమా పట్టణాల్లో భూమి కంపించినట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇదీ చూడండి: వెనెజువెలా జైలులో ఘర్షణ-23మంది ఖైదీల మృతి