ETV Bharat / international

'డబ్బు ఇవ్వడానికి వాళ్లు రెడీ- ఎందుకు తీసుకోకూడదు'

చైనా కంపెనీ బైట్‌డాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌ యాప్ అమెరికా కార్యకలాపాలు ప్రముఖ అమెరికన్‌ సంస్థ ఒరాకిల్ సొంతం కానున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారాన్ని తాను పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ వెల్లడించారు. జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

Looking into Oracle-TikTok deal to ensure no compromise on national security: Trump
'ఒరాకిల్​- టిక్​టాక్​ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నా'
author img

By

Published : Sep 17, 2020, 9:12 AM IST

Updated : Sep 17, 2020, 11:52 AM IST

టిక్​టాక్​ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ అమెరికా సంస్థ ఒరాకిల్​ దాఖలు చేసిన బిడ్​ను పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు. ఈ ఒప్పందంపై ఆమోద ముద్ర వేసే ముందు.. జాతీయ భద్రత విషయంలో రాజీపడకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు ట్రంప్​.

"ఈ ఒప్పందానికి సంబంధించిన అధ్యయనాలు నా దగ్గరకు వస్తున్నాయి. జాతీయ భద్రత విషయంలో 100 శాతం కచ్చితంగా ఉండాలి. దేశానికి చైనా ఎంత నష్టం చేస్తోందో చూస్తూనే ఉన్నాం. అందుకే ఒప్పందాన్ని నేను చూడాలి. "

-- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

మరోవైపు ఈ సంస్థల లావాదేవీల ద్వారా అమెరికా ఖజానా భారీగా లబ్ధిపొందుతుందని ఆశించారు ట్రంప్​. అయితే ఇందుకు సంబంధించిన నియమాలను ఆయన తప్పుబట్టారు.

"ప్రభుత్వానికి భారీగా నిధులు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ డబ్బులు తీసుకోవడానికి మాకు అనుమతి లేదు. అసలు ఇవేం నిబంధనలు? దీన్ని కచ్చితంగా పరిశీలిస్తాం. వెంటనే పరిశీలిస్తాం."

--- డొనాల్డ్​ ట్రంప్​. అమెరికా అధ్యక్షుడు

టిక్‌టాక్‌ వినియోగదారుల సమాచారం చైనాకు చేరుతుందంటూ, వారి సమాచార భద్రతపై గతంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో యాప్ యూఎస్‌ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా విక్రయించేలా ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా.. బైట్‌డ్యాన్స్‌ అందుకు అంగీకరించలేదు. తాజాగా ఒప్పందం కుదుర్చుకునేందుకు ఒరాకిల్​- బైట్​డాన్స్​లు చాలా దగ్గరగా ఉన్నట్టు ట్రంప్​ ఇటీవలే వెల్లడించారు.

ఇదీ చూడండి:- 'మోదీ బొమ్మ'కు కోటి వ్యూస్​- ట్రంప్​ అస్త్రం హిట్​

Last Updated : Sep 17, 2020, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.