ETV Bharat / international

పార్కులో అగ్ని ప్రమాదం- తప్పిన ప్రాణాపాయం - అమెరికా అమ్యూజ్​మెంట్​ పార్కులో అగ్ని ప్రమాదం

అమెరికాలోని ఓ అమ్యూజ్​మెంట్​ పార్కులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Large fire damages New Jersey
పార్కులో అగ్ని ప్రమాదం- తప్పిన ప్రాణాపాయం
author img

By

Published : Jan 31, 2021, 7:53 AM IST

అమెరికా న్యూజెర్సీ రాష్ట్రం ఓషియానా నగరంలోని 'ప్లేల్యాండ్స్​ క్యాస్టవే కోవ్'​ అమ్యూజ్​మెంట్​ పార్కులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సమీపంలోని ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. భవనం మొత్తం పొగతో నిండిపోయింది. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

పార్కులో అగ్ని ప్రమాదం- తప్పిన ప్రాణాపాయం

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడనాకి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దెబ్బతిన్న పార్కును పునర్నిర్మిస్తామని స్థానిక నేతలు హామీ ఇచ్చారు. త్వరలోనే తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం నేపథ్యంలో వ్యాపార సముదాయాలకు నెలవైన బోర్డ్​వాక్​ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:ఆస్పత్రిలో మంటలు- తప్పిన పెనుప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.