ETV Bharat / international

లేడీ గాగా శునకాలు దొరికాయ్​ - పాప్ సింగర్​ లేడీ గాగా శునకాలు లభ్యం

పాప్ సింగర్​ లేడీ గాగా శునకాలు దొరికాయి. ఓ మహిళ వాటిని పోలీస్​ స్టేషన్​కు తీసుకొచ్చి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించిన లేడీ గాగా ప్రతినిధులు.. అవి తమవేనని నిర్ధరించారని చెప్పారు.

Lady Gaga's dogs recovered
పోలీస్​ స్టేషన్​కు చేరిన 'లేడీ గాగా' శునకాలు!​
author img

By

Published : Feb 28, 2021, 6:44 AM IST

Updated : Feb 28, 2021, 9:23 AM IST

పాప్​ సింగర్​ లేడీ గాగా శునకాలను దొంగల నుంచి సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు లాస్​ ఏంజెల్స్​​ పోలీసులు శుక్రవారం తెలిపారు. తమ పోలీస్​ స్టేషన్​కు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఓ మహిళ.. శునకాలను తీసుకొచ్చి అప్పగించారని పోలీసు అధికారి జోనాథన్​ ట్రిపెట్​ తెలిపారు. ఆమె ఎవరు? శునకాలను ఎక్కడ గుర్తించారు? తదితర విషయాలను మాత్రం వెల్లడించలేదు.

లేడీ గాగా ప్రతినిధులు, పరిశోధకులు స్టేషన్​కు వచ్చి శునకాలను పరిశీలించారని, అవి తమవేనని నిర్ధరించారని ట్రిపెట్​ చెప్పారు.

లాస్​ ఏంజెల్స్​​లోని ఉత్తర సియోర్రా బోనిటా అపార్ట్​మెంట్​ వద్ద బుధవారం రాత్రి దుండగులు శునకాలను సంరక్షించే వ్యక్తిపై కాల్పులు జరిపి, గాగాకు చెందిన రెండు ఫ్రెంచ్​ జాతి శునకాలను ఎత్తుకుపోయారు. మరోవైపు, సినిమా చిత్రీకరణ నిమిత్తం లేడీ గాగా ప్రస్తుతం రోమ్​లో ఉన్నారు.

ఇదీ చదవండి:కరోనా రిలీఫ్​ బిల్లుకు ప్రతినిధుల సభ​ ఆమోదం

Last Updated : Feb 28, 2021, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.