కరోనా వైరస్ ముప్పు గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ముందే తెలుసా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ పాత్రికేయులు బాబ్ ఉడ్‌వర్డ్. అంతేకాదు.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. తన మామయ్యను చంపిన విషయమూ ట్రంప్‌కు వివరించినట్లు పేర్కొనటం సంచలనం సృష్టిస్తోంది.
ట్రంప్‌తో చేసిన వరుస ఇంటర్వూల ఆధారంగా రేజ్ అనే పుస్తకాన్ని రాశారు బాబ్. ఇందులో వైరస్, ఆర్థిక సంక్షోభం, జాత్యాంహకార నిరసనలపై ట్రంప్ మాట్లాడారని వివరించారు. కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో ముందే తెలుసని ట్రంప్ తనతో చెప్పినట్లు ఈ పుస్తకంలో రాశారు బాబ్.
అంతేకాకుండా.. అమెరికా వద్ద ఉన్న ఓ రహస్య ఆయుధం, కిమ్‌తో సంబంధాల గురించి కూడా ట్రంప్ చెప్పినట్లు బాబ్ తెలిపారు.
కిమ్‌తో సంబంధాలపై..
ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు సంబంధించి 25 వ్యక్తిగత లేఖలను సంపాదించినట్లు చెప్పారు ఉడ్‌వర్డ్. అందులో ఓ లేఖలో తమ బంధాన్ని ఫాంటసీ చిత్రంతో పోల్చారు కిమ్. సింగపూర్‌లో భేటీ సమయంలో కిమ్ పట్ల ట్రంప్ ఆకర్షితులయ్యారని చెప్పారు బాబ్.
"కిమ్ మనం అనుకున్నదానికన్నా చాలా తెలివైనవారని ట్రంప్ అన్నారు. తనతో అన్ని విషయాలు పంచుకున్నట్లు తెలిపారు. తన అంకుల్‌ను ఎలా చంపారో కూడా ట్రంప్‌కు కిమ్ పూర్తిగా వివరించారు. నిఘా అధికారుల అంచనాల ప్రకారం ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను ఎన్నటికీ వీడదని చెప్పారు. ప్యాంగాంగ్ను ఎలా నియంత్రించాలో సీఐఏకూ అర్థం కావట్లేదన్నారు."
- రేజ్ పుస్తకంలోని కొన్ని వివరాలు
ఇదీ చూడండి: 'నోబెల్ శాంతి బహుమతి' రేసులో ట్రంప్!