ETV Bharat / international

నా గెలుపు మహిళాలోకం సాధించిన విజయం: కమల - America new vice president news

ఉపాధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపును మహిళాలోకం సాధించిన విజయంగా అభివర్ణించారు కమలా హారిస్​. అమెరికా మహిళలు తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసమే ఈ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాట్లు.. డెలావేర్‌లోని వెల్మింగ్టన్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవలో సభలో ఆమె ప్రసంగించారు.

Kamala says US vice president victory is women world's victory
నా విజయం మహిళాలోకం గెలుపే: కమల
author img

By

Published : Nov 8, 2020, 7:57 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత జో బైడెన్ సొంతరాష్ట్రం డెలావేర్‌లోని వెల్మింగ్టన్‌లో తొలిసభలో ఏర్పాటు చేశారు డెమొక్రాట్లు. ఈ సభలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్​ ప్రసంగించారు.

ఎన్నికల్లో తన గెలుపును మహిళాలోకం సాధించిన విజయంగా అభివర్ణించారు కమలా హారిస్​. అమెరికా మహిళలు తమ ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసమే ఈ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. 'ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళను కావొచ్చు. కానీ చివరి మహిళను కాను' అని కమల అన్నారు.

అధ్యక్ష పదవికి ఎన్నికైన బైడెన్ నిరంతరం అమెరికన్ల క్షేమం కోసమే ఆలోచిస్తారని పేర్కొన్న కమల... ఆయన అమెరికాను సురక్షితంగా ఉంచగలరని విశ్వాసం తనకుందన్నారు.

ఇదీ చూడండి: శ్వేతసౌధ అధికార బదిలీకి రంగం సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.