ETV Bharat / international

వ్యాక్సిన్‌పై ట్రంప్‌ మాటల్ని నమ్మలేం: హారిస్‌

కరోనా వైరస్​కు త్వరలోనే టీకా రానుందని చెబుతోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాటల్ని తాను నమ్మడం లేదని డెమోక్రాటిక్​ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్​ అన్నారు. కేవలం ఎన్నికల ప్రయోజనం కోసమే వ్యాక్సిన్​ ప్రక్రియను వేగవంతం చేశారని.. ట్రంప్​పై ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు కమలా​.

KAMALA HARRIS SAYS CANNOT BELIEVE TRUMP ON VACCINE
వ్యాక్సిన్‌పై ట్రంప్‌ మాటల్ని నమ్మలేం: హారిస్‌
author img

By

Published : Sep 6, 2020, 10:40 AM IST

కరోనా వ్యాక్సిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబుతున్న మాటల్ని తాను ఏమాత్రం విశ్వసించడం లేదని డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష బరిలో ఉన్న కమలా హారిస్‌ అన్నారు. ట్రంప్‌ చెబుతున్నట్లుగా ఒకవేళ అధ్యక్ష ఎన్నికల నాటికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. దాని సామర్థ్యం, భద్రతపై తనకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని దాన్ని అభివృద్ధి చేస్తున్న సంస్థలపై ట్రంప్‌ ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కమలా హారిస్‌ ఆయనపై విమర్శలు చేశారు.

అందుకే టీకాస్త్ర ప్రయోగం..

తాజా అధ్యక్ష ఎన్నికల్లో మహమ్మారి వ్యాప్తి కట్టడి కీలక ప్రచారాస్త్రంగా మారింది. ట్రంప్‌ కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా విఫలమయ్యారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు ఇప్పటి వరకు అగ్రరాజ్యంలోనే నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విమర్శల నుంచి బయటపడడానికి ట్రంప్‌ ప్రత్యర్థులపై టీకా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. త్వరలోనే టీకా రాబోతోందంటూ.. అందుకు సంస్థలకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం వ్యాక్సిన్‌ తయారీ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

విమర్శలకు అవే బలం..

నవంబరు 1 నాటికి వ్యాక్సిన్‌ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు అమెరికా వ్యాధి నియంత్రణా, నివారణ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే వ్యాక్సిన్‌కు ప్రయోగపూర్వకంగా అత్యవసర వినియోగం కింద ముందస్తు అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ప్రకటించింది. మరోవైపు ఈ ఏడాది చివరకు లేదా అంతకంటే ముందే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు ట్రంప్​. ఈ పరిణామాలన్నీ వ్యాక్సిన్‌ విషయంలో ట్రంప్‌పై వస్తున్న విమర్శలకు బలం చేకూరుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: 'అక్టోబర్​లో అమెరికా టీకా రావడం కష్టమే'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.