కమలా హారిస్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచమంతటా మార్మోగిపోతోంది. ఎందుకంటే అగ్రరాజ్య రాజకీయాల్లో కీలకమైన అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా హారిస్ పోటీచేయనుండటమే ఇందుకు ప్రధాన కారణం. అందులోనూ భారత సంతతికి చెందిన మహిళ కావడం మరో విశేషం. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్.. ఉపాధ్యక్ష రేసులో కమలా హారిస్‌ను ఎంచుకున్నారు. ఉపాధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా కమలా హారిస్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు మీకోసం.






